US H1B Visa Applications: అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్లకు గుడ్ న్యూస్, మార్చి 1వ తేదీ నుంచి హెచ్1బీ వీసాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న US, 31కల్లా వీసా హోల్డర్ల పేర్లు
2023–24 సంవత్సరానికి గాను మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్1బీ వీసాలకు (H1B visa ) దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఆదివారం తెలిపింది
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్. 2023–24 సంవత్సరానికి గాను మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్1బీ వీసాలకు (H1B visa ) దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఆదివారం తెలిపింది. మార్చి 17వ తేదీ వరకు హెచ్1బీ వీసా దరఖాస్తులకు (H1B visa applications) అవకాశం ఉంటుందని, మార్చి 31కల్లా వీసా హోల్డర్ల పేర్లను ప్రకటిస్తామని పేర్కొంది.
అమెరికా కంపెనీల్లో పనిచేసే విదేశీ సాంకేతిక నిపుణులకు ఇచ్చే నాన్–ఇమిగ్రాంట్ వీసా హెచ్1బీ. ఏడాదికి 85 వేల వరకు హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తుంటారు. ఇందులో అత్యధికంగా లాభపడేది భారత్, చైనా దేశస్తులే. టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి రంగాలకు చెందిన ఈ వీసా దారులు ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండి పని చేసుకునేందుకు వీలుంటుంది. ఆరేళ్ల తర్వాత శాశ్వత నివాసం లేదా గ్రీన్‌కార్డుకు అర్హులవుతారు.