VCL Media Player: వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ఎందుకు నిషేధించారు, కారణం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించిన వీడియో లాన్, న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరిక
భారత కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపించింది. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వీఎల్‌సీ మీడియా ప్లేయర్ ను భారత కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో నిషేధించిన (VCL Media Player banned in Indi) సంగతి విదితమే. ఈ యాప్ ను ఒక్క భారత్ లోనే ఏటా 25 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేస్తుంటారు.అయితే దీనిపై నిషేధం విధించడంతో వీఎల్ సీ మీడియా ప్లేయర్ మాతృసంస్థ వీడియో లాన్ తీవ్రంగా స్పందించింది. భారత కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపించింది. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో వీడియో లాన్ భారత టెలికాం విభాగానికి లేఖ ( VideoLAN sends legal notice to govt) రాసింది.
ఎలాంటి కారణాలు చూపకుండా నిషేధం విధించడం సరికాదని, తమ యాప్ ను నిషేధించడంపై భారత కేంద్రం ప్రభుత్వం కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని వీడియో లాన్ పేర్కొంది. కనీసం తమ వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించింది. వీఎల్ ఈ మీడియా ప్లేయర్ యాప్ ను ఎందుకు నిషేధించారో ఇప్పుడైనా వెల్లడించాలని డిమాండ్ చేసింది.వర్చువల్ విధానంలో తమ అభిప్రాయాలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరింది.
వీఎల్ సీ మీడియా ప్లేయర్ ను నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల కాపీని అందజేయాలని కూడా స్పష్టం చేసింది. తాము కోరిన విధంగా భారత కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపరమైన చర్యలకు (threatens legal action) వెనుకాడబోమని వీడియో లాన్ హెచ్చరించింది.