Vodafone Idea: వొడాఫోన్ నుంచి సూపర్ ప్లాన్, రూ.82తో ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు సోనీ లివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ఉచితం

యూజర్లు ఈ మొత్తంతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు సోనీ లివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను 28 రోజుల పాటు ఉచితంగా పొందొచ్చు.

Vodafone Idea New Logo (Photo Credits: Company website)

వొడాఫోన్ ఐడియా పలు ప్రయోజనాలతో కూడిన రూ.82 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్ ను ప్రవేశపెట్టింది. యూజర్లు ఈ మొత్తంతో రీచార్జ్ చేసుకుంటే ఒక నెల పాటు సోనీ లివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను 28 రోజుల పాటు ఉచితంగా పొందొచ్చు. ఇది యాడాన్ ప్యాక్. కనుక ఈ మొత్తంతో రీచార్జ్ చేసుకుంటే వచ్చే అదనపు ప్రయోజనం 4జీబీ డేటా. దీని వ్యాలిడిటీ 14 రోజులు.

ఇందులో ఎటువంటి వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. యూజర్లు స్పోర్ట్ స్ట్రీమ్స్ అయిన యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్, డబ్ల్యూడబ్ల్యూఈ తదితర వాటిని వీక్షించొచ్చు. సోనీ లివ్ సబ్ స్క్రిప్షన్ అన్నది కేవలం మొబైల్ కే పరిమితం. ఇతర సాధనాల ద్వారా వీక్షించడానికి కుదరదు. అంటే ల్యాప్ టాప్, కంప్యూటర్లు సిస్టమ్ లో వాడుకోవడానికి ఉండదు. వొడాఫోన్ ఐడియా ఇటీవలే రూ.98, రూ.195, రూ.319 పేరుతో పలు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించడం తెలిసిందే.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif