WhatsApp: ఈ మెసేజ్ పంపితే మీ వాట్సాప్ అకౌంట్ డిలీట్ అయినట్లే, యూజర్ల అనుమతి లేకుండా వారికి మెసేజ్‌లు పంపితే బ్లాక్, తెలియని నంబర్లకు స్పామ్‌మెసేజ్‌లు పంపితే వాట్సాప్‌ ఖాతాలు బ్లాక్‌

WhatsaApp (Photo Credits: Pxfuel)

వాట్సాప్ ఈ మధ్య యూజర్లకు తెలియకుండానే వారి అకౌంట్లను డిలీట్ చేస్తోంది. దీనికి కారణం వాట్సాప్‌ యాప్‌ను మిస్‌యూజ్‌ చేస్తోన్న వారు అధికమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపై వాట్సాప్‌ కఠినవైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 20 లక్షల ఇండియన్‌ ఖాతాలను వాట్సాప్‌ మూసివేసింది. వాట్సాప్‌ పాలసీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయా యూజర్ల వాట్సాప్‌ ఖాతాలను డిలీట్‌ చేస్తుంది. మీరు ఒక వేళ తెలిసి, తెలియాక వాట్సాప్‌కు విరుద్ధంగా చేశారంటే మీ అకౌంట్‌ను వాట్సాప్‌ బ్లాక్‌ చేస్తోంది. అక్టోబర్‌ 4 న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలను ఏడు గంటలపాటు నిలిచి పోయినా విషయం తెలిసిందే.

మీరు ఇలా చేస్తే మీ వాట్సాప్‌ ఖాతా బ్లాక్‌​ (WhatsApp can suspend or delete your account) అయినట్లేనని వాట్సప్ పాలసీ చెబుతోంది. థర్డ్‌ పార్టీ, లేదా మోడెడ్‌ వాట్సాప్‌ యాప్‌లను వాడకూడదు..! వాట్సాప్‌కు బదులుగా ఇతర క్లోనింగ్‌ యాప్స్‌ లభిస్తున్నాయి. జీబీ వాట్సాప్‌, వాట్సాప్‌ ప్లస్‌, వాట్సాప్‌ మోడ్‌ యాప్‌లను ఉపయోగించే వారివి ఖాతాలను వాట్సాప్‌ తొలగిస్తుంది. ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీకి భంగం వాటిల్లితుంది. తెలియని నంబర్లకు స్పామ్‌మెసేజ్‌లను పంపితే వాట్సాప్‌ ఆయా యూజర్లను బ్లాక్‌ చేస్తోంది. ఆయా యూజర్లకు అనుమతి లేకుండా మెసేజ్‌లను పంపితే బ్లాక్‌ చేస్తోంది. రెసిపెంట్‌ ఒక వేళ మీరు పంపినా మెసేజ్‌లను స్పామ్‌గా గుర్తించి వాట్సాప్‌కు రిపోర్ట్‌ చేస్తే మీ వాట్సాప్‌ ఖాతాలు బ్లాక్‌ అవుతాయి. మీ అనుమతి లేకుండానే (without notice if you do) ఇవి జరుగుతాయి

రెండోసారి ఫేస్‌బుక్‌ డౌన్, క్షమాపణలు కోరిన యాజమాన్యం, ఫేస్‌బుక్‌పై విమర్శలు గుప్పించిన నెటిజన్లు

సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్‌ వాడుతున్నారు. వారందరి కోసం వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఈ ఫీచర్ గురంచి ఓ సారి తెలుసుకుందాం. మనం వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌లను పంపిస్తూ ఉంటాం. వాయిస్‌ మెసేజెస్‌ను స్పీకర్‌ ఐకాన్‌పై ప్రెస్‌ చేసి మెసేజ్‌లను రికార్డు చేసి ఇతర యూజర్లకు పంపుతాం. స్పీకర్‌ ఐకాన్‌పై ఆన్‌ప్రెస్‌ చేయగానే వాయిస్‌ మెసేజ్‌ ఇతర యూజర్లకు వెళ్లిపోతుంది.

వాయిస్‌ మెసేజ్‌ రికార్డు చేసే సమయంలో మెసేజ్‌లను ‘పాజ్‌’ చేసి తిరిగి మరల రికార్డు చేసే సౌకర్యాన్ని వాట్సాప్‌ త్వరలోనే తీసుకురానుంది. వాయిస్‌ మెసేజ్‌ రికార్డు విషయంలో కొత్తగా పాజ్‌, ప్లే బటన్లను వాట్సాప్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డిలీట్‌, సెండ్‌ బటన్‌ కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ ఫీచర్‌తో మనకు నచ్చిన అప్పుడు ఎక్కడంటే అక్కడ వాయిస్‌ మెసేజ్‌ను రికార్డు చేసే సౌకర్యాన్ని పొందవచ్చును. WABetainfo ప్రకారం... ఈ కొత్త ఫీచర్‌ త్వరలోనే వాట్సాప్‌ బెటా ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉండనుంది.