WhatsApp Delete Feature: ఫోటో పంపిన రెండు రోజుల తర్వాత కూడా డిలీట్ చేయొచ్చు! వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్, మరిన్ని కొత్త అప్‌డేట్స్ తీసుకువస్తున్న వాట్సాప్, గ్రూప్ అడ్మిన్లకోసం కొత్త కొత్త ఆప్షన్లు
ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌ను యూజర్లను అనుమతించేందుకు రిలీజ్ చేస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మెసేజ్‌లను పంపిన గంట తర్వాత డిలీట్ చేసేందుకు యూజర్లకు అనుమతించనుంది.
New Delhi, July 15: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేంజర్ వాట్సాప్ (WhatsApp) ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. మీ వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్ పంపితే కొద్దిగంటల్లోనే ఆ మెసేజ్ డిలీట్ (Message delete)చేసే వీలుంది. అయితే ఒకసారి పంపిన మెసేజ్ నిర్ణీత గడువు దాటితే అవతలి యూజర్ చాట్ నుంచి మెసేజ్ డిలీట్ చేయలేం. వాట్సాప్ బీటా (WhatsApp Beta)ఛానెల్‌లో మెసేజ్ పంపిన 2 రోజుల తర్వాత డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌ను యూజర్లను అనుమతించేందుకు రిలీజ్ చేస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మెసేజ్‌లను పంపిన గంట తర్వాత డిలీట్ చేసేందుకు యూజర్లకు అనుమతించనుంది. ఈ ఫీచర్ టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రమే వర్తించదు. యూజర్లు ఫోటోలు(Photos), వీడియోలు(videos) వంటి మీడియా ఫైల్‌లను ఈజీగా అన్‌సెండ్ చేయవచ్చు. వాట్సాప్ అప్‌డేట్ ట్రాకర్ WABetaInfo ప్రకారం.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ (2.22.4.10) WhatsApp బీటాలో రిలీజ్ కానుంది. ఒక యూజర్‌కు మెసేజ్ పంపిన తర్వాత 2 రోజులు, 12 గంటల్లో తమ మెసేజ్‌లను అన్‌సెండ్ చేయగలరని నివేదిక చెబుతోంది.
వచ్చే ఫిబ్రవరిలో ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్టు పేర్కొంది. కానీ, ఈ ఫీచర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై క్లారిటీ లేదు. వాట్సాప్ మరో డిలీట్-సంబంధిత ఫీచర్‌పై టెస్టింగ్ చేస్తోంది. యూజర్లకు అతి తొందరలోనే ఈ కొత్త ఫీచర్ రానుంది. మీ చాట్‌లోని ఏదైనా మెసేజ్, మీడియా ఫైల్‌లను డిలీట్ చేయాలంటే.. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు (Group Admins)అనుమతి ఉంటుంది. బీటా యూజర్లకు మాత్రం అందుబాటులోకి రాలేదు. రెగ్యులర్ యూజర్లకు మాత్రం ఈ ఫీచర్ ఇప్పట్లో రావడం చాలా కష్టమే అని చెప్పవచ్చు.
వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్ స్టేటస్(online status) నిర్దిష్ట వ్యక్తుల నుంచి హైడ్ చేయవచ్చు. ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసే చాలా మంది యూజర్లకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. గ్రూపు సభ్యుల నుంచి మాత్రమే ఈ స్టేటస్ హైడ్ చేసుకోవచ్చు. కానీ, అడ్మిన్ మాత్రమే మీరు హైడ్ చేసిన విషయం తెలుస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా డెవలప్ స్టేజీలోనే ఉంది. బీటా యూజర్లకు అందుబాటులో లేదు. మరోవైపు.. 2022 చివరిలో Whatsapp కమ్యూనిటీలను తీసుకురానుంది. గ్రూప్ అడ్మిన్‌లకు డిలీట్ ఆప్షన్ కూడా Whatsapp కమ్యూనిటీలతో పాటు ప్రవేశపెట్టనుంది.