WhatsApp New Feature: వాట్సాప్ అడ్మిన్ల కోసం కొత్త ఫీచర్, ఇక నుంచి గ్రూప్ మెంబర్ పోస్టులతో బెడద ఉండదు, అడ్మిన్లు పోస్ట్ డిలీట్ చేసేలా నయా ఫీచర్, అందుబాటులోకి వస్తే అడ్మిన్లకు నో టెన్షన్
గ్రూప్‌లో షేర్ చేసే పోస్ట్ ను అడ్మిన్‌లు డిలీట్ చేసేలా(allow admins to delete messages ) కొత్త ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే యూజర్స్ కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
New Delhi December 16: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల(WhatsApp Group Admins) కోసం కొత్త ఫీచర్స్ రానున్నాయి. గ్రూప్‌లో షేర్ చేసే పోస్ట్ ను అడ్మిన్‌లు డిలీట్ చేసేలా(allow admins to delete messages ) కొత్త ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే యూజర్స్ కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే అభ్యంతరకరమైన పోస్టుల కారణంగా ఇప్పటికే పలువురు అడ్మిన్లు ఇబ్బందుల పాలయ్యారు. వారిపై కేసుల వరకు వెళ్లింది. దీంతో అడ్మిన్లకు మేలు చేసేలా కొత్త ఫీచర్(New Feature) ను డెవలప్ చేసింది వాట్సాప్.
కొన్ని సందర్భాల్లో గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసే కొన్ని పోస్టులు గ్రూప్ అడ్మిన్‌లను చిక్కుల్లో పడేస్తుంటాయి. ఒకవేళ గ్రూప్‌లోంచి సదరు మెసేజ్ డిలీట్ చేయాలంటే సాధ్యంకాని పరిస్థితి. దాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రమే సదరు మెసేజ్‌ను డిలీట్ చేయాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడేసేందుకే గ్రూప్ అడ్మిన్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్(New Feature)ను తీసుకువస్తున్నారు. ఈ ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్(WhatsApp) కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది.
వాట్సాప్(WhatsApp) గ్రూప్‌లోని సభ్యులు షేర్ చేసిన టెక్ట్స్, ఫొటో, వీడియో, డాక్యుమెంట్ ఫైల్‌లను డిలీట్ చేయాలా.. వద్దా అనేది ఇక మీదట గ్రూప్ అడ్మిన్(Group Admins)లు నిర్ణయిస్తారు. ఒకవేళ అభ్యంతరకరమైన మెసేజ్‌లను గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేస్తే.. గ్రూప్ చాట్ పేజీలో గ్రూప్ అడ్మిన్ దాన్ని తొలగించారు అనే మెసేజ్ కనిపిస్తుంది. గ్రూప్‌కు ఒకరికి మించి ఎక్కువమంది అడ్మిన్‌లుగా ఉన్నా.. ఈ ఫీచర్‌తో వారందరూ మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చని వాబీటాఇన్ఫో తెలిపింది. అలా అడ్మిన్‌లు గ్రూప్ ఆసక్తికి విరుద్ధంగా ఉన్న మెసేజ్‌లను సులువుగా తొలగించవచ్చు.
దీంతోపాటు వాట్సాప్ డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్స్ తాము పంపిన మెసేజ్‌ను నిర్ణీత కాలవ్యవధిలో డిలీట్ అయ్యేలా టైమ్ లిమిట్ పెట్టొచ్చు. గతంలో వాట్సాప్ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్ 7 నిమిషాలుగా ఉండేది. త్వరలోనే మూడు కొత్త టైమ్ లిమిట్‌లను తీసుకొస్తుంది. అవి గంట, 8 నిమిషాలు, 16 సెకన్లు. దీనివల్ల యూజర్ పంపిన మెసేజ్‌లో ఏవైనా తప్పులు ఉంటే పైన పేర్కొన్న కాలపరిమితిలోపు వాటిని డిలీట్ చేస్తే అవతలివారు చూడలేరు. ఇవేకాకుండా వాట్సాప్ ప్లేయర్, ఆడియో మెసేజ్ ప్రివ్యూ, కమ్యూనిటీ వంటి మరికొన్ని కొత్త ఫీచర్లను వాట్సాప్(WhatsApp) యూజర్స్‌కు పరిచయం చేయనుంది.