Whatsapp on 4 Device: వాట్సాప్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్, ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో వాడుకునేలా కొత్త అప్‌డేట్, విండోస్‌కోసం సరికొత్త యాప్‌ రూపొందించిన వాట్సాప్‌

దీంతో ఇకపై మీ వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో (4 devices) లాగిన్ అవ్వొచ్చు. దీనిపై వాట్సాప్ అధికారికంగా ట్వీట్ చేశారు. ఇకపై చార్జర్ అవసరం లేదు, ఎలాంటి సమస్య లేదు, ఒకవేళ మీ ఫోన్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినప్పటికీ, మిగిలిన డివైజ్‌ల్లో వాట్సాప్ వాడుకోవచ్చు అంటూ ట్వీట్ చేసింది.

WhatsApp (Photo-IANS)

New Delhi, March 23: వినియోగదారుల కోసం వాట్సాప్ (WhatsApp) మరోసరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. దీంతో ఇకపై మీ వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో (4 devices) లాగిన్ అవ్వొచ్చు. దీనిపై వాట్సాప్ అధికారికంగా ట్వీట్ చేశారు. ఇకపై చార్జర్ అవసరం లేదు, ఎలాంటి సమస్య లేదు, ఒకవేళ మీ ఫోన్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినప్పటికీ, మిగిలిన డివైజ్‌ల్లో వాట్సాప్ వాడుకోవచ్చు అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే వాట్సాప్‌ అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ గ్రూపుల విషయంలో ఇటీవల తెచ్చిన మార్పులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటూ ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్స్ తెచ్చేందుకు మెటా టీమ్ (Meta team) పనిచేస్తుందని ప్రకటించింది. ఇక ఒకేసారి నాలుగు డివైజ్‌ ల్లో లాగిన్ అయ్యి ఉండేందుకు వాట్సాప్ సరికొత్త విండోస్‌ యాప్‌ను తీసుకువచ్చినట్లు ప్రకటించింది. వేగవంతమైన వినియోగం కోసం దీంట్లో అన్ని పీచర్లను, సరికొత్త ఇంటర్‌ ఫేస్‌ను పొందుపరిచినట్లు వాట్సాప్ తెలిపింది.

ఇప్పటికే రెండు రోజుల క్రితం వాయిస్‌ రికార్డు (Voice record) చేసి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకునేలా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. స్టేటస్ ద్వారా 30 సెకండ్లు వాయిస్ రికార్డ్ చేసుకునే వీలు కల్పించింది వాట్సాప్. దీనికోసం ముందు స్టేటస్ ఓపెన్ చేయాలి. అందులో పెన్ సింబల్ కనిపిస్తుంది. ఇదివరకు అది క్లిక్ చేసి కంటెంట్ రాసుకోవడానికి మాత్రమే వీలుండేది. ఇప్పుడు పెన్ సింబల్ ఓపెన్ చేయగానే టైపింగ్ బార్ పక్కన వాయిస్ రికార్డ్ సింబల్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్ పెట్టుకోవచ్చు.