Xiaomi 14 Smartphone: వావ్ అనిపించే కెమెరా ఫీచర్లతో షావోమి నుంచి Xiaomi 14 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్, భారత మార్కెట్లో విడుదలయ్యేది మాత్రం అప్పుడే.. దీని ధర ఎంత ఉండొచ్చంటే..?

Xiaomi 14 Smartphone (Photo Credit: Official Website)

Xiaomi 14 Smartphone Series: ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిదారు అయిన షావోమి, ప్రస్తుతం బార్సిలోనాలో జరుగుతున్న 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' సందర్భంగా వివిధ ఉత్పత్తులను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ క్రమంలో షావోమి బ్రాండ్ నుంచి ఫ్లాగ్‌షిప్ కెమెరా-ఫోకస్డ్ Xiaomi 14 సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో Xiaomi 14 మరియు Xiaomi 14 అల్ట్రా అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్ సెట్లు జర్మన్ కెమెరా-మేకర్ అయిన లైకా సమన్వయంతో అభివృద్ధి చేయబడ్డాయి.

అయితే, ఈ రెండు మోడళ్లలో Xiaomi 14 మాత్రమే భారతీయ మార్కెట్‌లో విడుదల చేయనుంది. మార్చి 7 న భారతదేశంలో Xiaomi 14 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. Samsung, Apple మరియు OnePlus బ్రాండ్లలోని లకు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను పోటీగా Xiaomi 14 స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. భారతీయ మార్కెట్లో దీని ధర సుమారు రూ. 75,000గా ఉంటుందని అంచనా.

భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ iXiaomi 14 స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Xiaomi 14 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

అదనంగా, ఇన్- డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, USB టైప్-సి ఆడియో, హై-రెస్ ఆడియో, డాల్బీ అట్మోస్, స్టీరియో స్పీకర్లు, 4-మైక్రోఫోన్ అర్రే, 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7 802.11 be, బ్లూటూత్ 5.4, బీడౌ, గెలీలియో, GLONASS, GPS (L1 + L5), NavIC మొదలైనవి ఉన్నాయి.

Xiaomi 14 జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో, రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.

ధరలు:

12GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర సుమారు రూ. 75,000 ఉండొచ్చని అంచనా

12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన మోడల్ ధర సుమారు రూ. 90,000 ఉండొచ్చని అంచనా. అయితే, ఈ ధరలపై మార్చి 7, 2024న స్పష్టత వచ్చే అవకాశం ఉంది.