Xiaomi Special Edition: మీ ఫోన్ బంగారం కాను! రూ:4.80 లక్షలతో ఖరీదైన స్మార్ట్ ఫోన్ తయారు చేసిన షియోమి, ఇప్పుడు అమ్మాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉంది.
దాని ధర, దాని స్టైల్, దాని ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి...
ప్రముఖ చైనీస్ మొబైల్ తయారీదారు షియోమి (Xiaomi) Red miK20, Redmi K20 Pro లను భారత మార్కెట్లో విడుదల చేసినపుడు Redmi K20 Pro లో స్పెషల్ ఎడిషన్ ను కూడా తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఒక్క ఫోన్ తయారీకే సంస్థకు రూ. 4 లక్షల 80 వేలు ఖర్చు అయింది. ఎందుకంటే ఈ ఫోన్ వెనక ప్యానెల్ 100 గ్రాముల బంగారం ఉపయోగించి తయారు చేయగా దానిపైన బ్రాండ్ లోగో 'K' అక్షరం వజ్రాలతో అలంకరించారు. కేవలం 20 యూనిట్లు మాత్రమే తయారు చేస్తున్నట్లు షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ వెల్లడించారు. అయితే వీటి అమ్మకంపై సంస్థ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, వీటిని అమ్మకానికి పెట్టాలా? లేక వేలం వేయాలా? ఇవేవీ కాకుండా బహుమతి కింద ఇచ్చేయాలా అనేవి పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ పేర్కొన్నారు. ఒకవేళ వేలం వేస్తే తద్వారా వచ్చే డబ్బును స్వచ్ఛంద సేవలకు ఉపయోగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
https://twitter.com/manukumarjain/status/1151399619080798208
కాగా, ఇండియాలో ఇప్పటికే ఈ ఫోన్లపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారట. కొంతమంది లోగో స్థానంలో వారి పేరు వచ్చేలా డిజైన్ చేయమని షియోమికి ఆర్డర్లు కూడా ఇస్తున్నారట. అయితే ఈ గోల్డ్ సిరీస్ లో 20 ఫోన్లకు మించి ఎక్కువ చేయబోమని అలాగే ఈ ఫోన్ ప్రత్యేకతను అలాగే ఉంచటం కోసం లోగో విషయంలో కూడా ఎలాంటి మార్పులు చేయబోమని షియోమి ఇండియా స్పష్టం చేసింది.
అంతేకాకుండా షియోమి నుంచి టీ - షర్ట్స్, షూస్, ఫిట్ నెస్ బ్రాండ్స్ కూడా ప్రవేశ పెట్టనున్నట్లు సంస్థ తెలిపింది.
ఇక బంగారం ఫోన్ ఇతర ఫీచర్ల వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి..
6.39 అంగుళాల ఫుల్- హెచ్‌డీ స్క్రీన్
వెనక 48+13+8 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 830 ప్రాసెసర్
4000mAh బ్యాటరీ సామర్థ్యం
ర్యామ్ 8GB/128GB స్టోరేజ్ మరియు ర్యామ్ 8GB/256GB స్టోరేజ్ - రెండు వేరియంట్లు
అండ్రాయిడ్ 9 పై (Android 9 Pie) ఆపరేటింగ్ సిస్టమ్.