China Apps Ban Row: మళ్లీ 15కు పైగా చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం, బ్యాన్ లిస్టులో షియోమి ఎంఐ బ్రౌజర్ ప్రో,బైదూ సెర్చ్, భారత ప్రభుత్వం నుంచి ఇంకా రాని అధికారిక ప్రకటన

మొత్తం 47 క్లోన్ యాప్‌లపై వేటు వేసింది. తాజాగా మరో 15పైగా చైనా యాప్‌లను కేంద్రం నిషేధించినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో నిషేధానికి గురైన యాప్‌లకు చెందిన ప్రో, లైట్ వర్షెన్లు కూడా ప్రస్తుతం బ్యానయ్యాయని అనధికార సమాచారం. వీటిల్లో షియోమి కార్ప్ బ్రౌజర్ (Xiaomi’s Mi Browser Pro), బైదూ సెర్చ్ (Baidu Search) కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Xiaomi Representational Image (Photo Credits; Xiaomi)

భారత ప్రభుత్వం కొద్ది వారాల క్రితం నిషేధిత 59 చైనా యాప్‌లను (China Apps Ban) పోలిన క్లోన్‌లను బ్యాన్ చేసిన సంగతి విదితమే. మొత్తం 47 క్లోన్ యాప్‌లపై వేటు వేసింది. తాజాగా మరో 15పైగా చైనా యాప్‌లను కేంద్రం నిషేధించినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో నిషేధానికి గురైన యాప్‌లకు చెందిన ప్రో, లైట్ వర్షెన్లు కూడా ప్రస్తుతం బ్యానయ్యాయని అనధికార సమాచారం. వీటిల్లో షియోమి కార్ప్ బ్రౌజర్ (Xiaomi’s Mi Browser Pro), బైదూ సెర్చ్ (Baidu Search) కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై కేంద్రం ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అంతే కాకుండా.. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, చైనా రాయాబార్య కార్యాలయం కూడా ఈ విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించలేదని తెలుస్తోంది. కాగా భారత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని చైనా గతంలో ఆక్షేపించిన విషయం తెలిసిందే. పబ్‌జీ ఇండియా నుంచి త్వరలో అవుట్, చైనా కంపెనీలకు మరో షాకిచ్చిన కేంద్రం, 59కు తోడుగా మరో 47 యాప్స్‌ బ్యాన్‌, 275 యాప్‌ల‌పై నిషేధం దిశగా అడుగులు

ఈ వార్తలు ఇలా ఉంటే ఈ పరిణామంపై షియోమి (Xiaomi) ప్రతినిధి స్పందించారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల కలిగే ఫలితాలను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే.. చైనా గూగుల్‌గా పేరుగాంచిన బైదూ మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి కామెంట్ చేయలేదు. ప్రస్తుతం షియోమి భారత్‌లో నెం.1 స్మార్ట్ ఫోన్ కంపెనీగా కొనసాగుతోంది. చైనాపై భారత్ డిజిటల్ స్ట్రైక్, చైనీస్ యాప్స్ బ్యాన్‌ను డిజిటల్ స్ట్రైక్‌గా అభివర్ణించిన కేంద్ర ఐటీశాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్

హాంగ్‌కాంగ్‌కు చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ అంచనా ప్రకారం. భారత్‌లో షియోమికి దాదాపు 9 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు షియోమి బ్రౌజర్‌పై వేటుపడటంతో ఇకపై ఈ యాప్ లేకుండానే కంపెనీ తన ఫోన్లను తయారు చేయాల్సి ఉంటుందని టెక్ నిపుణులు అంటున్నారు.