WhatsApp New Feture: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై సినిమా కూడా వాట్సాప్‌లో పంపించుకోవచ్చు, కొందరికి అందుబాటులోకి వచ్చిన ఫీచర్, మీరు కూడా ఇలా ట్రై చేయండి!

వాట్సాప్ లో ఇకపై పెద్ద ఫైల్స్(Big Files) కూడా సులభంగా పంపుకోవచ్చు. అంటే.. ఒక సినిమా వీడియో మొత్తాన్ని ఒకే ఫైల్లో పంపుకోవచ్చు. ఇప్పటివరకూ పెద్ద సైజు ఫైల్స్(Big Files) వీడియోలను పంపుకునే వీల్లేదు. ఎందుకంటే.. కేవలం 100MB వరకు మాత్రమే ఫైల్స్ పంపుకోనే వీలుంది.

WhatsaApp (Photo Credits: Pxfuel)

New Delhi, June 03: వాట్సాప్ (Whats App) యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ లో ఇకపై పెద్ద ఫైల్స్(Big Files) కూడా సులభంగా పంపుకోవచ్చు. అంటే.. ఒక సినిమా వీడియో మొత్తాన్ని ఒకే ఫైల్లో పంపుకోవచ్చు. ఇప్పటివరకూ పెద్ద సైజు ఫైల్స్(Big Files) వీడియోలను పంపుకునే వీల్లేదు. ఎందుకంటే.. కేవలం 100MB వరకు మాత్రమే ఫైల్స్ పంపుకోనే వీలుంది. ఇకపై ఆ సమస్య ఉండదు. వాట్సాప్ తమ యూజర్ల కోసం ఫైల్ సైజు పరిమితిని పెంచేసింది. 100MB నుంచి 2GB వరకు పెంచేసింది. ఒక సినిమా ఫుల్ వీడియో సైజు ఫైళ్లను కూడా ఈజీగా ఒకరి నుంచి మరొకరికి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ (Whats App)ప్లాట్ ఫాంపై ఏదైనా ఫొటోలు లేదా వీడియోలను 2GB ఫైల్ సైజు వరకు పంపుకోవచ్చు అన్నమాట.

Spicejet Flights: స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై​ ర్యాన్‌సమ్‌వేర్ దాడి, నాలుగు గంటల పాటు విమానంలో నరకం చూసిన ప్రయాణికులు, పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపిన యాజమాన్యం  

2GB వ‌ర‌కు ఫైల్స్‌ను(2GB Files) పంపుకోవచ్చునే విషయాన్ని ఈ ఏడాది మార్చిలోనే వాట్సాప్ ప్ర‌క‌టించింది. ఇప్పుడా ఈ ఫీచ‌ర్‌ను అర్జెంటీనాలో ప్రవేశపెట్టి వాట్సాప్ ప్ర‌యోగాత్మ‌కంగా టెస్టింగ్ చేసింది. లేటెస్టుగా ఈ ఫీచ‌ర్‌ను ఇత‌ర దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ యూజ‌ర్లు ఎవ‌రైనా 2GB వరకు ఫైల్స్ ఏమైనా పంపుకోవచ్చు. వాట్సాప్ (Whats App) ప్రపంచవ్యాప్తంగా అందరి యూజర్లకు అందుబాటులోకి తీసుకురాలేదు. ముందుగా కొంత‌మంది యూజ‌ర్లు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెగ్యులర్ వాట్సాప్ యూజ‌ర్ల‌ందరికి త్వ‌ర‌లోనే ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు మెసేజింగ్ కంపెనీ ప్లాన్ చేస్తోంది.

WhatsApp: వాట్సాప్ దారులకు హెచ్చరిక, 16 లక్షలపైగా వినియోగదారుల ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్  

ఈ ఫీచ‌ర్ పనిచేస్తుందో చెక్ చేయండిలా :

100MB కన్నా ఎక్కువ ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్షన్ మీకు వచ్చిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. ఏదైనా ఒక కాంటాక్ట్ నంబ‌ర్‌కు 100MB కన్నా ఎక్కువ సైజ్ వీడియోను డాక్యుమెంట్ రూపంలో పంపండి. అప్పుడు ఆ వీడియో అప్‌లోడ్ చేయండి. అది అప్‌లోడ్ అయితే ఈ ఫీచ‌ర్ మీకు అందుబాటులోకి వచ్చినట్టే.. లేదంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.