Spicejet Airlines

స్పైస్‌జెట్ సిస్టమ్స్‌పై​ ర్యాన్‌సమ్‌వేర్ దాడి కారణంగా వందలాది ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. దీంతో ప్యాసెంజర్లు ఆందోళనకు దిగారు. సోషల్‌ మీడియాలో వీడియోలు, పోస్ట్‌లతో విరుచుకుపడ్డారు. దాదాపు నాలుగు గంటల పాటు విమానంలో బాధలుపడుతున్నామంటూ ఒక యూజర్‌ వీడియో పోస్ట్‌ చేశారు.

మరోవైపు రాన్‌సమ్‌వేర్ అటాక్‌తో బుధవారం ఉదయం స్పైస్‌జెట్ డిపార్చర్స్‌ ఇబ్బందులు, ప్రయాణికులు చిక్కుకుపోవడంపై అధికార ప్రతినిధి స్పందించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ అటాక్ (Attempted Ransomware Attack) కారణంగా బుధవారం ఉదయం నాటి విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని ట్విట్‌ చేశారు. ఈ పరిణామాన్ని తమ ఐటీ టీం సరిదిద్దిందని, విమాన సేవలు సజావుగానే ఉన్నాయంటూ స్పైస్‌జెట్ (Spicejet Flights) ట్విట్ చేసింది.

ఇక స్పైస్‌జెట్ లిమిటెడ్, క్రెడిట్ సూయిస్ ఏజీ మధ్య వివాద సెటిల్‌మెంట్, అంగీకారం నిబంధనలపై (మే 23) సంతకాలు ముగిసాయి. తుది ఉత్తర్వుల కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిసింది. ఇందులో భాగంగా కొంత మొత్తాన్ని ముందస్తుగా చెల్లించేందుకు పరస్పర అంగీకారం కుదిరిందని స్పైస్‌జెట్ తెలిపింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు స్పైస్‌జెట్ ఇప్పటికే 5 మిలియన్ల డాలర్ల బ్యాంక్ గ్యారెంటీని అందించిందని, దీనికి సంబంధించి తమపై ఎలాంటి ప్రతికూల ఆర్థిక ప్రభావం ఉండదని తెలిపింది. స్విస్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్‌ ఓవర్‌హాలింగ్ సర్వీస్ ప్రొవైడర్‌ ఎస్‌ఆర్‌ టెక్నిక్స్‌కు 24 మిలియన్ల డాలర్లకు పైగా చెల్లింపులు చేయడంలో ఎయిర్‌లైన్ విఫలమవడంతో క్రెడిట్ సూయిస్ స్పైస్‌జెట్‌పై గత సంవత్సరం మద్రాస్ హైకోర్టులో దావా వేసింది.

గొర్రెకు మూడేళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు, మహిళను చంపేయడంతో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన సూడాన్ పోలీసులు

స్పైస్‌జెట్ బోయింగ్ 737లు, క్యూ-400లు,ఫ్రైటర్‌ విమానాలను నడుపుతుంది. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ కింద 63 రోజువారీ విమాన సర్వీసులతో దేశంలో అతిపెద్ద ప్రాంతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్. రాబోయే కొద్ది నెలల్లో మరిన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ప్రవేశ పెడుతుందని, త్వరలో తమ విమానాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నట్లు సీఎండీ అజయ్ సింగ్ సోమవారం తెలిపారు.