Earn Money fromYouTube Shorts: ఇకపై యూట్యూబ్ షాట్స్‌తో కూడా మనీ సంపాదించవచ్చు! కొత్త పాలసీ తీసుకువచ్చిన యూట్యూబ్, కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమలవుతాయంటే?

టెక్ దిగ్గజం గత ఏడాదిలో షార్ట్ వీడియో (Short Videos) కంటెంట్‌ను రూపొందించే కంటెంట్ క్రియేటర్లకు మానిటైజేషన్ (monetization) ఆప్షన్లను అందిస్తామని హామీ ఇచ్చింది. గూగుల్ (Google) ఫిబ్రవరి 2023 నుంచి YouTube Shortsలో ఆదాయ భాగస్వామ్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.

YouTube| Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, JAN 11: యూట్యూబర్లకు గుడ్‌ న్యూస్.. యూట్యూబ్‌ (Youtube) ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన అవకాశం.. మీరు యూట్యూబ్‌లో కంటెంట్‌ని క్రియేట్ చేయడం ద్వారా మరింత డబ్బు సంపాదించవచ్చు. యూట్యూబ్ లాంగ్ లెన్త్ వీడియోలతో మాత్రమే కాదు.. షార్ట్ వీడియోలతో కూడా లక్షల్లో సంపాదించవచ్చు. ఎందుకంటే.. యూట్యూబ్ షార్ట్‌ (Youtube Shorts) కోసం గూగుల్ ఎట్టకేలకు మానిటైజేషన్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెస్తోంది. టెక్ దిగ్గజం గత ఏడాదిలో షార్ట్ వీడియో (Short Videos) కంటెంట్‌ను రూపొందించే కంటెంట్ క్రియేటర్లకు మానిటైజేషన్ (monetization) ఆప్షన్లను అందిస్తామని హామీ ఇచ్చింది. గూగుల్ (Google) ఫిబ్రవరి 2023 నుంచి YouTube Shortsలో ఆదాయ భాగస్వామ్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఫిబ్రవరి 1, 2023 నుంచి మానిటైజింగ్ పార్టనర్‌షిప్‌లుగా సైన్ అప్ చేసిన YouTube కంటెంట్ క్రియేటర్లు YouTube షార్ట్‌ వీడియోల మధ్య యాడ్స్ నుంచి డబ్బు సంపాదించుకోవచ్చునని గూగుల్ ప్రకటించింది.

Telegram Fraud Alert: టెలిగ్రామ్‌లో మూవీస్ డౌన్లోడ్ చేయడానికి లింక్ లు క్లిక్ చేస్తున్నారా, అయితే మీరు సైబర్ బారీలో పడినట్లే, హెచ్చరికలు జారీ చేసిన విశాఖ పోలీసులు 

షార్ట్ ఫీడ్‌లోని వీడియోల మధ్య యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ కొత్త రెవిన్యూ షేరింగ్ మోడల్ (YouTube Shorts Fund) ఫండ్‌ను రిప్లేస్ చేస్తుందని గూగుల్ బ్లాగ్ పోస్టులో పేర్కొంది. ప్రస్తుతం, YouTube Partner Program (YPP) షార్ట్ వీడియోల కోసం క్రియేటర్లకు రివార్డ్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఫండ్ సిస్టమ్ కింద ఆన్‌లైన్ వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ YouTube కమ్యూనిటీతో పాటు క్రియేటర్ల క్రియేటివిటీ, అసలైన షార్ట్‌ వీడియోలను అందించేందుకు క్రియేటర్‌ల కోసం గూగుల్ 100 మిలియన్ డాలర్ల ఫండ్ అంకితం చేసింది.

KYC Fraud Alert: ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, బ్యాంకులు తమ ఖాతాదారులకు KYC అప్‌డేట్ లింక్‌ను ఎప్పుడూ పంపవు, అలర్ట్ జారీ చేసిన ఢిల్లీ పోలీసులు  

YouTube భాగస్వామి ప్రోగ్రామ్ కొత్త అప్‌డేట్‌లో భాగంగా Shorts ద్వారా డబ్బు సంపాదించే కొత్త విధానం తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. దీని ప్రకారం.. పార్టనర్ ప్రోగ్రామ్ కాంట్రాక్ట్ ఒప్పందాలపై ఇప్పటికే Sign చేసిన కంటెంట్ క్రియేటర్లు YouTube Shorts నుంచి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా లేదో అనేది (Agree) చేస్తూ కొత్త ఒప్పంద నిబంధనలపై సంతకం చేయాల్సి ఉంటుంది. కొత్త రాబడి-భాగస్వామ్య మోడల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కంటెంట్ క్రియేటర్లు తమ షార్ట్ వీడియోలను మానిటైజ్ (monetization) చేసుకోవచ్చు. లాంగ్-లెన్త్ వీడియోల నుంచి సంపాదించే ఆదాయం మాదిరిగానే యాడ్స్ నుంచి డబ్బు సంపాదించుకోవచ్చు.

YouTubeలో మానిటైజింగ్ పార్టనర్ అయ్యేందుకు కంటెంట్ క్రియేటర్లు (Shorts Monetization Module) మానిటైజేషన్ మాడ్యూల్‌ను ఆమోదించాల్సి ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. ఈ మాడ్యూల్ షార్ట్ ఫీడ్‌లోని YouTube ప్రీమియం, యాడ్స్ ద్వారా YouTubeలో డబ్బు సంపాదించడానికి కంటెంట్ క్రియేటర్లకు అనుమతించనుంది. మాడ్యూల్‌ను ఆమోదించాలంటే యూట్యూబ్ క్రియేటర్లు ఫిబ్రవరి 1, 2023 తర్వాత నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుంది. యూట్యూబ్ క్రియేటర్లు నిబంధనలను అంగీకరించిన తేదీ నుంచి షార్ట్‌ల (ad revenue sharing) అనేది ఆయా ఛానెల్‌కు అర్హత ఉన్న Shorts Views వీడియోలకు మాత్రమే వర్తిస్తుంది. Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ అందుబాటులోకి రావడానికి ముందు వచ్చిన (Shorts Views) వీడియోలకు మాత్రం (Shorts ad revenue Sharing) వర్తించదని గమనించాలి.

Jio 5G in Andhra Pradesh: నెల్లూరు, తిరుపతిలో జియో 5జీ సేవలు వచ్చేశాయి, ఏపీలో 5జీ కోసం రూ.26,000 కోట్లను ఖర్చుపెట్టిన రిలయన్స్ జియో  

ఆసక్తికరంగా, YouTube న్యూ రెవిన్యూ మోడల్ నేరుగా షార్ట్ వీడియో కంటెంట్ పోటీదారు అయినTikTok రెవిన్యూను తీవ్రంగా దెబ్బతీస్తుంది. షార్ట్‌ వీడియోలతో YouTube టిక్‌టాక్‌తో నెక్ టు నెక్ పోటీని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ, యాడ్స్ రెవిన్యూ నేరుగా కంటెంట్ క్రియేటర్లతో షేర్ చేసుకోవడం ద్వారా TikTok కన్నా Youtube Shorts మరింత మంది కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించడంలో సాయపడనుంది. తద్వారా క్రియేటర్లు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.



సంబంధిత వార్తలు