Turkey Earthquake: నిజంగా వీళ్లు మృత్యుంజయులే! భూకంపం సంభవించిన 8 రోజుల తర్వాత క్షేమంగా బయటపడ్డ వృద్ధురాలు, మనువరాలు, 198 గంటలుగా శిథిలాల కిందనే జీవించిన ఇద్దరిని కాపాడిన రెస్క్యూ టీం

భూకంపం సంభవించి ఎనిమిది రోజులు గడుస్తున్నప్పటికీ....ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. అయితే గంటల తరబడి శిథిలాల కింద చిక్కుకున్న వారు బయటపడ్డారు. కానీ ఎనిమిదిరోజులుగా శిథిలాల కిందనే జీవించి (trapped for more than 8 days) ఉన్న ఇద్దరిని రెస్క్యూ టీం కాపాడింది.

Turkey Earthquake. (Photo Credits: Twitter@DDNewslive)

Turkey, FEB 14: భారీ భూకంపంతో అతలాకుతలం అయిన టర్కీలో (Turkey) సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం సంభవించి ఎనిమిది రోజులు గడుస్తున్నప్పటికీ....ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. అయితే గంటల తరబడి శిథిలాల కింద చిక్కుకున్న వారు బయటపడ్డారు. కానీ ఎనిమిదిరోజులుగా శిథిలాల కిందనే జీవించి (trapped for more than 8 days) ఉన్న ఇద్దరిని రెస్క్యూ టీం కాపాడింది. టర్కీలోని ఖహర్మరాస్ లో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది ఇద్దరిని సురక్షితంగా (alive from earthquake rubble) బయటకు తెచ్చారు.

భూకంపం సంభవించిన 198 గంటల తర్వాత వారు ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎనిమిది రోజులుగా తిండి, నీళ్లు లేకపోవడంతో వారు నీరసించిపోయారు. వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, ఆస్పత్రికి తరలించారు. ఎనిమిదిరోజులుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించిన ఇద్దరిలో ఒక వృద్ధురాలు కూడా ఉండటం గమనార్హం.