Alabama Shooting: అమెరికాలో మరోసారి కాల్పులు, బర్త్‌డే పార్టీలో విచక్షణారహితంగా ఫైరింగ్, నలుగురు మృతి, 20 మందికి గాయాలు
అలబామా (Alabama) రాష్ట్రంలోని ఓ పుట్టినరోజు వేడుకలో కొందరు దుండగులు కాల్పులకు (Birthday Party Shooting) తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయాలపాలైనట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Alabama, April 16: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలబామా (Alabama) రాష్ట్రంలోని ఓ పుట్టినరోజు వేడుకలో కొందరు దుండగులు కాల్పులకు (Birthday Party Shooting) తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయాలపాలైనట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అలబామాలోని (Alabama Shootiong) డేడ్‌విల్లేలో ఉన్న ఓ డ్యాన్స్ స్టూడియోలో కొందరు యువతీ యువకులు పుట్టినరోజు వేడుక చేసుకున్నారు.
రాత్రి 10.30గంటల సమయంలో అక్కడ ఒక్కసారిగా కాల్పుల మోత మొదలయ్యింది. బర్త్‌డే జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన కొందరు యువకులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. అయితే, వీటికి సంబంధించి అసలేం జరిగిందWashingtonనే విషయం ఇప్పుడే చెప్పలేమని అలబామా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. అనుమానితులను కస్టడీలో తీసుకున్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. పలు విభాగాల సహకారంతో పూర్తి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.
మెక్సికోలోని ఓ వాటర్ పార్కులో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో చిన్నారితో సహా ఏడుగురు మృతి చెందారు. సెంట్రల్ మెక్సిలోని గువానాజువాటోలో ఉన్న ఓ రిసార్టులో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన అనంతరం అక్కడున్న సీసీకెమెరా ఫుటేజీని దుండగులు ఎత్తుకెళ్లారు.