Terror Attack in Russia: రష్యాలో ఉగ్రవాదుల ఘాతుకం.. మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై దాడి.. గ్రెనేడ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. 60 మంది మృతి.. దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసిన ఐసిస్
రాజధాని మాస్కోలోని క్రాస్నోగోర్స్క్ లోని క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై ఉగ్రవాదులు బాంబులు విసరడంతోపాటు కాల్పులకు తెగబడ్డారు.
Moscow, Mar 23: రష్యాలో (Russia) ఉగ్రవాదులు (Terrorists) ఊచకోతకు పాల్పడ్డారు. రాజధాని మాస్కోలోని (Moscow) క్రాస్నోగోర్స్క్ లోని క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై ఉగ్రవాదులు బాంబులు విసరడంతోపాటు కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కనీసం 60 మంది మృత్యువాతపడగా.. మరో 100 మందికిపైగా గాయపడ్డారని సమాచారం.
మాకు సంబంధం లేదు: జెలెన్స్కీ
ఈ దాడికి బాధ్యత తమదేనని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఈ దాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటన విడుదల చేశారు.