Syed Ahmed Shah Sadat: నాడు ఐటీ శాఖ మంత్రి..నేడు పిజ్జా డెలివరీ బాయ్, జర్మనీలో ఇంటింటికి వెళ్లి పిజ్జాలు అందిస్తున్న ఆప్ఘనిస్తాన్ మాజీ మంత్రి సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌, పొట్టకూటి కోసం తప్పదంటున్న రాజకీయ నేత

మొన్నటిదాకా అధికారంలో ఉండి కూడా పొట్టకూటి కోసం ఇప్పుడు పిజ్జాబాయ్ అవతారమెత్తాడు.

Afghanistan’s Former IT Minister Now Works As PIzza Delivery Boy in Germany (Photo-Twitter)

Berlin, August 25: అఫ్గానిస్తాన్‌లో ఒకప్పుడు ఐటీ శాఖా మంత్రిగా (Afghanistan’s Former IT Minister) పనిచేసిన రాజకీయ నేత ఇప్పుడు జర్మనీలో పిజ్జాలు డెలివరీ (PIzza Delivery Boy in Germany) చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. మొన్నటిదాకా అధికారంలో ఉండి కూడా పొట్టకూటి కోసం ఇప్పుడు పిజ్జాబాయ్ అవతారమెత్తాడు. అఫ్గానిస్తాన్‌ ఐటీ మాజీ మంత్రి సయ్యద్‌ అహ్మద్‌ షా సాదత్‌. మొన్నటి దాక స్వదేశంలో ఐటీ అభివృద్ధిపై దృష్టి సారించిన సాదత్‌ (Syed Ahmed Shah Sadat) ఇప్పుడు విదేశంలో పిజ్జాలు అందించడంపై దృష్టి పెట్టారు.

ఈ దుస్థితికి గల కారణాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘గతేడాది దేశ అధ్యక్షుడు అశ్రఫ్‌ ఘనీతో తనకు విబేధాలు, మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశా. రాజీనామా అనంతరం కొంతకాలం ప్రశాంతంగా జీవనం సాగింది. అనంతరం నా వద్ద ఉన్న డబ్బు ఖర్చయిపోయింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో డెలివరీ బాయ్‌గా చేయాల్సి వచ్చింది’ అని తెలిపారు. సాదత్‌ ప్రస్తుతం జర్మన్‌లోని లీప్‌జిగ్‌ పట్టణంలో పిజ్జాలు సైకిల్‌పై డెలివరీ చేస్తున్నారు. ఈ పని చేయడానికి తానేమీ మొహమాట పడడం లేదని పేర్కొన్నారు.

Here's Afghan Former IT minister now delivering pizza

సాదత్‌ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అఫ్గానిస్తాన్‌లో మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ అభివృద్ధి చేశారు. మాజీ మంత్రిగా మారిన అనంతరం స్వదేశంలోనే ఉన్నారు. కాగా ఆఫ్ఘన్ మాజీ మంత్రి తనకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయని చెప్పారు. ఇది కాకుండా, అతను 13 దేశాల నుండి 20 కి పైగా కంపెనీలతో కమ్యూనికేషన్ రంగంలో పనిచేశానని తెలిపారు.

తాలిబన్ల రాకతో అంతా నాశనమైపోయింది, కంటతడి పెట్టిన ఆఫ్ఘ‌నిస్థాన్‌ ఎంపీ నరేంద‌ర్ సింగ్ ఖాస్లా, భారత్ మీద దాడికి సహకరించాలని తాలిబన్లను కోరిన హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్, ఆడియో మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్

తాలిబన్లు దేశాన్ని ఆక్రమిస్తారని ముందే గ్రహించి తాలిబన్లు ఆక్రమించే వారం రోజుల ముందే జర్మన్‌కు వచ్చేశారు. ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురవడంతో కుటుంబ పోషణ కోసం విధిలేక డెలివరీ బాయ్‌ అవతారం ఎత్తారు. కాగా అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారాయి. సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఈ భయంతో పక్కదేశాలకు తరలి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యులతో పాటు ఆ దేశ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.