Kabul, August 22: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తిరిగి తాలిబన్ల రాజ్యం వచ్చిన అక్కడ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా ఆ దేశానికి చెందిన ఇద్దరు ఎంపీలు ఇండియాకు వచ్చారు. ఆదివారం ఉదయం కాబూల్‌లోని భారతీయులను తీసుకొచ్చిన సీ17 విమానంలోనే ఈ ఎంపీలతోపాటు 24 మంది సిక్కులు ఇండియాలో ల్యాండయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడిన సెనేటర్ నరేందర్ సింగ్ ఖాస్లా (Afghanistan MP Narinder Singh) కంటతడి పెట్టారు. ఆఫ్ఘన్‌లో పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించగా.. ఎంపీ భావోద్వేగానికి (Breaks Down Upon Landing in India) గురయ్యారు. ఏడుపొస్తోంది. గత 20 ఏళ్లలో నిర్మించింది మొత్తం ఇప్పుడు నాశనమైపోయింది (Everything is Finished). అంతా శూన్యం అని నరేందర్ సింగ్ అన్నారు.
ఆదివారం ఉదయం సీ17 విమానంలో ( IAF’s C-17) మొత్తం 168 ప్రయాణికులను కాబూల్ నుంచి ఇండియాకు తీసుకొచ్చింది. అందులో 107 మంది భారతీయులు ఉన్నారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి ప్రతి రోజూ రెండు విమానాలను నడిపేందుకు ఇండియాకు అనుమతి లభించింది. ఆదివారం ఇండియాలో ల్యాండైన వాళ్లలో చాలా రోజుల నుంచి కాబూల్‌లోని గురుద్వారాలో తలదాచుకుంటున్న వాళ్లు ఉన్నారు. వీళ్లను ఇప్పుడు ఢిల్లీలోని బంగ్లా సాహిబ్ గురుద్వారాకు తరలించనున్నారు.
Here's Video
#WATCH | Afghanistan's MP Narender Singh Khalsa breaks down as he reaches India from Kabul.
"I feel like crying...Everything that was built in the last 20 years is now finished. It's zero now," he says. pic.twitter.com/R4Cti5MCMv
— ANI (@ANI) August 22, 2021
తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకొన్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటుకు జిహాదీ, రాజకీయ నేతలను బరాదర్ కలవనున్నట్టు తాలిబన్ ప్రతినిధి చెప్పారు. దోహాలోని తాలిబన్ల రాజకీయ కార్యాలయానికి కూడా చీఫ్ అయిన బరాదర్ మంగళవారమే అఫ్గానిస్థాన్ వచ్చారు. ప్రస్తుతం తాలిబన్ నేతల్లో అత్యంత సీనియర్ బరాదరే.
ఇక భారత్‌ను బెదిరిస్తూ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ఒక ఆడియో మెసేజ్‌ను విడుదల చేశాడు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు సహాయపడాలని తాలిబన్లను కోరాడు. ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ బలపడాలని, తద్వారా భారత్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు కశ్మీరీలకు వారు మద్దతు ఇవ్వాలని అల్లాను ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నాడు.