Afghanistan Crisis: దయనీయంగా అప్ఘన్ల పరిస్థితి, కిలో పిండి దాదాపు రూ. 2వేలు, ముంచుకొస్తున్న ఆహార కొరత, ఆకాశాన్నంటుతున్న ధరలు, తాలిబన్ల రాజ్యంలో దిగజారిపోతున్న ఆప్ఘన్ల జీవితాలు

అదేవిధంగా 16 లీట‌ర్ల నూనె(Oil) 2,800 ఆఫ్ఘనీలుగా ఉంది. ఇక 25 కిలోల బియ్యం బ్యాగ్(Rice bag) అయితే 2,700 ఆఫ్ఘనీలుగా పలుకుతోంది. కూలీ పనులకు వెళ్లి రోజుకు 100 ఆఫ్ఘనీలు ఆర్జించే పేద‌లు వారు సంపాదించింది తిండికి కూడా స‌రిపోవ‌డం లేదు.

Kabul December 12:  అప్ఘనిస్తాన్‌ (Afghanistan)ను ఆహార సంక్షోభం(Food Crisis) ముంచెత్తుతోంది. తాలిబన్లు(Taliban) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్దిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నాయి. అప్ఘనిస్తాన్ (Afghanistan) కరెన్సీ మారకం విలువ దారణంగా పడిపోతోంది. దీనికి తోడు విదేశీ మారకద్రవ్యం(Foreign currency) కూడా తగ్గుతుండటంతో రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. నిత్యావసర సరుకుల ధర చుక్కలు చూపిస్తున్నాయి.

ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ (Afghanistan) లో కిలో పిండి(Atta) 2,400 ఆఫ్ఘనీలు పలుకుతోంది. అదేవిధంగా 16 లీట‌ర్ల నూనె(Oil) 2,800 ఆఫ్ఘనీలుగా ఉంది. ఇక 25 కిలోల బియ్యం బ్యాగ్(Rice bag) అయితే 2,700 ఆఫ్ఘనీలుగా పలుకుతోంది. కూలీ పనులకు వెళ్లి రోజుకు 100 ఆఫ్ఘనీలు ఆర్జించే పేద‌లు వారు సంపాదించింది తిండికి కూడా స‌రిపోవ‌డం లేదు. కాగా ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)లో విరివిగా పండే ఉల్లి ధ‌ర మాత్ర కేవ‌లం 30 ఆఫ్ఘనీలు ఉంది.

Taliban-Afghanistan: మహిళలకు చోటిస్తే వ్యభిచారమే, వారు పిల్లల్ని కంటే చాలు, తాలిబన్ అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి సంచలన వ్యాఖ్యలు, తాత్కాలిక ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రద్దు

అప్ఘనిస్తాన్‌ (Afghanistan) ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి ఉంటుంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రపంచదేశాలతో వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దౌత్యపరమైన అంశాల్లో పలు దేశాలు అప్ఘనిస్తాన్‌ (Afghanistan) ను దూరం పెట్టాయి. దీంతో ఎగుమతులు, దిగుమతులు తగ్గిపోయాయి. దాంతో నిత్యావసరాల కొరత ఏర్పడింది. అక్క‌డి దుకాణ దారులు డాల‌ర్ల క‌రెన్సీలో కొని.. ఆఫ్ఘ‌నీ క‌రెన్సీలో అమ్మాల్సిన ప‌రిస్థితి. దీంతో వారు క‌రెన్సీ విలువ‌లో లోటుపాట్ల‌తో రోజూ స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఈ క్రమంలో… ఆఫ్ఘ‌న్ (Afghanistan) ప్ర‌జ‌లు ఏమీ కొనలేక‌ ఒకరోజు తిని.. మరొక రోజు పస్తులుంటున్నారు. ఆక‌లి బాధ త‌ట్టుకోలేక ఒకే కుటుంబంలో 8 మంది పిల్ల‌లు చ‌నిపోయార‌ని స్థానిక మీడియా తెలిపింది.