Amazon Layoffs: అమెజాన్ లో తొలగింపులు పదివేలు కాదు 20 వేలు! మేనేజర్లు సహా జాబితాలో ఎందరో..

అయితే, దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లోనే ఈ తొలగింపులు అత్యధికంగా ఉన్నట్టు ఇప్పటికే పలు నివేదికలు అంచనా వేశాయి.

File (Credits: Twitter)

Newyork, Dec 5: ట్విట్టర్ తో (Twitter) మొదలైన ఉద్యోగుల కోత ప్రక్రియ దాదాపు అన్ని కంపెనీలకు పాకింది. అయితే, దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) లోనే ఈ తొలగింపులు (Layoffs) అత్యధికంగా ఉన్నట్టు ఇప్పటికే పలు నివేదికలు అంచనా వేశాయి. అమెజాన్ పది వేల మంది ఉద్యోగులను (Employees) ఇంటికి పంపించనుందని గత నెలలో ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీలేదని సంస్థ వివరణ ఇచ్చింది. కానీ, తాజాగా బయటపడిన విషయం ఒకటి షాక్ కి గురి చేస్తుంది.

ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు.. రేపటి విచారణకు హాజరు కాలేను.. సీబీఐకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తమ ప్లాంట్లు (Plants), వేర్ హౌస్ లు, కంపెనీ ఔట్ లెట్లలో (Company Outlets) పనిచేస్తున్న సుమారు 20 వేల మంది ఉద్యోగులను అమెజాన్ ఇంటికి పంపించేయనున్నట్టు తాజా వార్తల సారాంశం. గతంలో అంచనా వేసినట్టు అమెజాన్ కంపెనీలో తొలగింపులు పది వేల మందితో ఆగిపోవని, రాబోయే రోజుల్లో మరింత మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపిస్తుందని తాజాగా బయటపడ్డ రిపోర్టుల్లో వెల్లడైంది.

అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోదీ.. ప్రజలు ప్రజాస్వామ్యం పండుగను గొప్పగా జరుపుకుంటున్నారని హర్షం

కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్లతో సహా చిన్నా పెద్ద ఉద్యోగులు మొత్తం 20 వేల మందిని తొలగించాలన్నదే అమెజాన్ ఆలోచన అని తేలింది. సంస్థలో పనిచేస్తున్న లెవల్ 1 నుంచి లెవల్ 7 వరకూ (టెక్నాలజీ, కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్, డిస్ట్రిబ్యూషన్) అన్ని స్థాయిల ఉద్యోగులపై  తొలగింపుల ప్రభావం  ఉండనున్నట్టు అంచనా.