Anura Kumara Dissanayake: శ్రీలంక అధ్యక్షుడిగా తొలిసారిగా లెఫ్ట్ పార్టీ నేత, ప్రమాణ స్వీకారం చేసిన వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే, శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ

దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు. కొలంబోలోని అధ్యక్ష సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Anura Kumara Dissanayake and PM Modi(Photo-File Image)

శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే (55) ప్రమాణస్వీకారం చేశారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు. కొలంబోలోని అధ్యక్ష సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్ర‌ధాని మోదీ సభ‌లో ఊర్రూత‌లూగించిన దేవిశ్రీ ప్ర‌సాద్‌.. గుండెలకు హత్తుకున్న ప్రధాని (వీడియో)

దేశంలో మొన్న అధ్యక్ష ఎన్నికలు జరగ్గా అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత దిస్సనాయకే, సమగి జన సంధానయ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఇద్దరూ గెలుపునకు అవసరమైన ఓట్లను పొందడంలో విఫలమయ్యారు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించడంతో దిస్సనాయకే విజయం ఖరారైంది. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దిస్సనాయకేకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. దిస్సనాయకే విజయం తర్వాత భారత హైకమిషనర్ వెంటనే ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.