Newdelhi, Sep 23: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో పాల్గొన్న రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) (Devi Sri Prasad) సందడి చేశారు. 'పుష్ప-1' మూవీలోని శ్రీవల్లి పాటతో ఊర్రూతలూగించారు. డీఎస్‌పీ 'హర్ ఘర్ తిరంగా' పాట పాడుతున్న సమయంలో ప్రధాని మోదీ వేదికపైకి చేరుకున్నారు. దాంతో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఇక నమస్తే ఇండియా అంటూ ప్రవాసులను పలకరించిన డీఎస్‌పీ.. ప్రధాని సమక్షంలోని తన పాటను కొనసాగించారు.
ఏసీ ట్రైన్ కోచ్ లో పాము.. గరీబ్ రథ్ రైలులో ఘటన.. ప్రయాణికుల కేకలు (వీడియో)
Here's Video:
దేవీశ్రీప్రసాద్ను హత్తుకున్న ప్రధాని మోదీ
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ న్యూయార్క్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి తాజాగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న తెలుగు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాదు హత్తుకున్నారు. దేవీతో పాటు సింగర్స్ హనుమాన్ కైండ్, ఆదిత్య గాధ్వీలను… pic.twitter.com/WlZb34IH7o
— ChotaNews (@ChotaNewsTelugu) September 22, 2024
గుండెలకు హత్తుకున్న మోదీ
ఈ క్రమంలో డీఎస్పీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న మోదీ.. ప్రత్యేకంగా అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టమాటను కొరికిన పాము.. ఈ వీడియో చూశాక.. ఇక నుంచి మీరు కూరగాయలు, పండ్లను పదేపదే కడుగుతారు (వీడియో)