Hyd, Aug 15: రిజర్వేషన్లు తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థుల ఆందోళనలకు కారణం కాగా వందలాది మంచి చనిపోయారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా బంగ్లాలో దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా ఆ దేశంలో ఉంటున్న హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన వివేక్ రామస్వామి స్పందించారు. బంగ్లాదేశ్ లో హిందువులు, మైనారిటీలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని ,,అసలు సమస్యకు కారణం ప్రభుత్వ ఉద్యోగాల కోటా విధానంలో ఉన్న లోపాలని చెప్పారు. 1971లో పాకిస్తాన్ నుంచి వేరుపడిన తరువాత బంగ్లాదేశ్ లో ఉద్యోగ కోటా సిస్టమ్ ను వివరించారు.
బంగ్లా స్వాతంత్ర్య పోరాటంలో వేల సంఖ్యలో బంగ్లా పౌరులను పాక్ సైనికులు హత్య చేశారు అన్నారు. తదనంతరం బంగ్లాకు స్వాతంత్ర్యం రాగా వీరికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సిస్టమ్ తీసుకొచ్చిందని.... ముఖ్యంగా సివిల్ సర్విస్ ఉద్యోగాల్లో 80 శాతం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్ ఉద్యమకారులకు వారి కుటుంబాలకు రిజర్వేషన్ కల్పించారు అని తెలిపారు. 20 శాతం మాత్రమే మెరిట్ కోటా ప్రవేశ పెట్టగా ఈ విధానంలో తప్పులున్నాయిని 2018లో మళ్లీ నిరసనలు మొదలయ్యాయని తెలిపారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నుంచి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అవుట్
Here's Tweet:
The targeted violence against Hindus in Bangladesh is wrong, it's concerning, and it's a cautionary tale for victimhood-laced quota systems. Here's what happened: Bangladesh fought a bloody war for its independence in 1971. Hundreds of thousands of Bangladeshi civilians were…
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) August 14, 2024
తర్వాత ప్రధానిగా ఉన్న ప్రధాని షేక్ హసీనా రిజర్వేషన్ కోటను రద్దు చేయగా 2024లో బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు పాత కోటా విధానాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చిందన్నారు. ఆ తర్వాత పెద్ద స్థాయిలో హింస జరుగగా దీనికి షేక్ హసీనా నియంతృత్వ పాలన కూడా కారణమన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లు 1971ని మించి పోయాయని తెలిపారు. ప్రధానంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని ఈ హింస నుంచి అందరూ పాఠాలు నేర్చుకోవాలన్నారు రామస్వామి.
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు రామస్వామి. అయితే తర్వాత తన ప్రయత్నాన్ని విరమించుకుని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ప్రకటించారు.