Indians Trapped in Myanmar: ఐటీ ఉద్యోగం,లక్షల్లో జీతమంటూ ఆఫర్, అంతర్జాతీయ రాకెట్‌లో చిక్కుకున్న 60 మంది భారత టెకీలు, మయన్మార్‌లో 30 మందిని రక్షించిన భారత హైకమిషన్

థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అంతర్జాతీయ రాకెట్‌లో చిక్కుకున్న 60 మందిలో 30 మందికి పైగా భారతీయులను మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం రక్షించింది.ఆ దేశంలోని మైవాడి ప్రాంతంలో చిక్కుకున్న (Indians Trapped in Myanmar) మిగిలిన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది.

Indian embassy in Myanmar (Photo-MEA.Gov.in)

Myawaddy, Sep 15: థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అంతర్జాతీయ రాకెట్‌లో చిక్కుకున్న 60 మందిలో 30 మందికి పైగా భారతీయులను మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం రక్షించింది.ఆ దేశంలోని మైవాడి ప్రాంతంలో చిక్కుకున్న (Indians Trapped in Myanmar) మిగిలిన వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. థాయిలాండ్ సరిహద్దులో ఉన్న ఆగ్నేయ మయన్మార్‌లోని కయిన్ రాష్ట్రంలోని మైవాడి ప్రాంతం (Myawaddy area) పూర్తిగా మయన్మార్ ప్రభుత్వం నియంత్రణలో లేదు.

కొన్ని సాయుధ తిరుగుబాటుదారీ జాతులు దానిపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.కాగా థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అంతర్జాతీయ ముఠా భారతీయులను మోసగించిందని, బదులుగా మయన్మార్‌కు అక్రమంగా తీసుకెళ్లారని అధికారులు చెప్పారు.కొన్ని బోగస్‌ ఐటీ కంపెనీలు ఇక్కడ నుంచి నకిలీ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, డిజిటల్‌ కుంభకోణాలు నడుపుతుంటాయి. వాటి ఏజెంట్లు భారతీయులకు థాయ్‌లాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సరైన పత్రాలు లేకుండానే మియవాడీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే వదిలేస్తున్నారు.

 వీడియో, కెనడాలో హిందూ ఆలయంను ధ్వంసం చేసిన దుండుగులు,భార‌త్‌కు వ్య‌తిరేకంగా ఆల‌యంపై రాత‌లు

కాగా యాంగోన్‌లోని భారత రాయబార కార్యాలయం తమ రక్షణ కోసం మయన్మార్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని అక్కడి వారు తెలిపారు.ఇదిలా ఉంటే జూలై 5న, భారతీయులకు ఉద్యోగాలను ఆఫర్ చేసే అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా కేంద్రం హెచ్చరికను జారీ చేసింది.అయితే మయన్మార్‌లోని మారుమూల తూర్పు సరిహద్దు ప్రాంతాలలో డిజిటల్ స్కామింగ్/ఫోర్జ్ క్రిప్టో కార్యకలాపాలలో నిమగ్నమైన కొన్ని ఎల్‌టి కంపెనీలు ఐటి రంగంలో ఉద్యోగాలు అంటూ దేశంలో వివిధ ప్రాంతాల నుండి తమ రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా భారతీయ కార్మికులను రిక్రూట్ చేస్తున్నాయని మిషన్ ఇటీవలి కాలంలో గమనించింది. ప్రారంభ రిక్రూట్‌మెంట్ తర్వాత, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా భారతీయ కార్మికులను చట్టవిరుద్ధంగా మయన్మార్‌కు తీసుకువెళ్లారని Indian mission పేర్కొంది.

పై విషయాల దృష్ట్యా, భారతీయ పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరియు రిక్రూటింగ్ ఏజెంట్ల పూర్వాపరాలను ధృవీకరించవలసిందిగా అభ్యర్థించారు. ఆఫర్ చేయబడిన ఏదైనా ఉద్యోగాన్ని అంగీకరించే ముందు అవసరమైన అన్ని సమాచారం (ఉద్యోగ వివరణ, కంపెనీ వివరాలు, స్థానం, ఉపాధి ఒప్పందం మొదలైనవి) కలిగి ఉండటం మంచిదని పేర్కొంది.

మయన్మార్ భారతదేశం యొక్క వ్యూహాత్మక పొరుగు దేశాలలో ఒకటి. ఇది నాగాలాండ్, మణిపూర్‌తో సహా అనేక ఈశాన్య రాష్ట్రాలతో 1,640-కిమీ-పొడవు సరిహద్దును పంచుకుంటుంది.