Chile Forest Fire: చిలీ అడవులను దహించివేస్తున్న కార్చిచ్చు, ఒక్కరోజే 46 మంది సజీవదహనం, 115కు చేరిన మృతుల సంఖ్య
సుమారు 1600 ఇండ్లు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరణాల సంఖ్య, దగ్ధమైన ఇండ్ల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని చిలీ (Chile) అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు.
Chile, FEB 05: చిలీ అడవుల్లో రగిలిన కార్చిచ్చుతో (Chile Forest Fires) మరణించిన వారి సంఖ్య 115 మందికి చేరుకున్నది. సుమారు 1600 ఇండ్లు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరణాల సంఖ్య, దగ్ధమైన ఇండ్ల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని చిలీ (Chile) అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తెలిపారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని చిలీ అంతర్గత వ్యవహారాల మంత్రి కరోలినా తోహా చెప్పారు. వాల్పారాయిసో ప్రాంత అడవుల్లో ప్రాణాంతక కార్చిచ్చు రగులుతున్నది. అయితే ప్రజలను తమ ఇండ్లలోనే ఉండాలని, అంబులెన్సులు, ఫైరింజన్లు, ఇతర ఎమర్జెన్సీ వాహనాల ద్వారా వారిని తరలిస్తామని చెప్పారు. కానీ ఎంత మంది మరణించారన్న సంగతి మాత్రం తోహా వెల్లడించలేదు. శుక్రవారం నుంచి మొదలైన కార్చిచ్చు వల్ల క్విల్పౌ, విల్లా అలెమనా పట్టణాలకు సమీపంలోని అడవుల్లో కార్చిచ్చు (Forest Fires) రగులుకున్నదని తోహా చెప్పారు. అగ్ని కీలల వల్ల కోస్టల్ రిసార్ట్ టౌన్ వినా డీల్ మార్ చుట్టుపక్కల ఇండ్లు దెబ్బ తిన్నాయి. విల్లా ఇండెపెండెన్సియా ప్రాంతంలోని పలు బ్లాకుల్లో గల ఇండ్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కార్లు పేలిపోవడంతోపాటు పగిలిన విండోలతో వీధుల్లో పడిపోయాయి.
తాను 32 ఏండ్లుగా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి చూడలేదని రొలాండో ఫెర్నాండేజ్ చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం సమీప కొండ వద్ద మంటలు చూశానని, కేవలం 15 నిమిషాల్లో మంటలు తమ ప్రాంతం అంతా వ్యాపించడంతో అందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు. తాను సంపాదించినదంతా బూడిదైందన్నారు. బాధితులను కాపాడేందుకు వాల్పారాసియో రీజియన్ పరిధిలో మూడు షెల్టర్లు ఏర్పాటు చేశారు. 19 హెలికాప్టర్లు, 450కి పైగా అగ్ని మాపక ఇంజిన్లను తీసుకొచ్చి మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.