Himalayan Viagra: వయాగ్రా కోసం హిమాలయాలకు, మంచు తుపానులో గల్లంతైన 5 మంది, హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానాలు
హిమాలయన్ వయాగ్రా లేదా యార్సగుంబా కోసం వెళ్లిన ఐదుగురు వ్యక్తులు పశ్చిమ దార్చులా జిల్లాలో హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు.
Five Missing for Searching Himalayan Viagra: హిమాలయన్ వయాగ్రాగా పిలిచే అత్యంత విలువైన మూలికను తీసుకు వచ్చేందుకు వెళ్లిన కొంతమంది గల్లంతైన ఘటన నేపాల్ లో చోటు చేసుకుంది. హిమాలయన్ వయాగ్రా లేదా యార్సగుంబా కోసం వెళ్లిన ఐదుగురు వ్యక్తులు పశ్చిమ దార్చులా జిల్లాలో హిమపాతంలో సమాధి అయ్యారని అనుమానిస్తున్నారు.
'మిస్ అయిన వారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అక్కడ వాతావరణ పరిస్థితి కూడా బాగా లేదని డిప్యూటీ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రదీప్ సింగ్ ధామి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బోలిన్‌లోని బయాన్స్ విలేజ్ కౌన్సిల్- 01 వద్ద భారీ హిమపాతం సంభవించిందని ఓ అధికారి తెలిపారు.
యార్సగుంబా మూలిక అన్వేషణలో భాగంగా అక్కడ టెంట్లు వేసుకున్న 12 మంది ఆ మంచు తుపానులో గల్లంతయ్యారని, వెంటనే స్పందించిన స్థానికులు భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారని అధికారులు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది కొందరిని కాపాడిందని, ఐదుగురి ఆచూకీ దొరకలేదని చెప్పారు. వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు.
యార్సగుంబా హిమాలయాల్లో లభించే విలువైన మూలిక. అరుదుగా లభించే ఇందులో ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఈ మూలికల్లో ఉంటుందని భావిస్తున్నారు. అందుకే దీనిని హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు.
వార్షిక యార్సగుంబా కోత సీజన్‌లో అనేక వారాల పాటు మంచుతో కప్పబడిన పర్వతాలను యాత్రికులు అధిరోహిస్తారు . ఈ సంవత్సరం నేపాల్‌లోని హిమాలయాల్లో పంట ప్రారంభం కానుంది. యార్సగుంబా , పరాన్నజీవి పుట్టగొడుగుల బీజాంశం (ఓఫియోకార్డిసెప్స్ సినెన్సిస్) మట్టిలో నివసించే ఈ జీవి చిమ్మట లార్వాను సోకినప్పుడు, అది చనిపోయి మమ్మీగా మారినప్పుడు ఒక ప్రత్యేకమైన గొంగళి పురుగు-ఫంగస్ కలయిక ఏర్పడుతుంది.
చనిపోయిన గొంగళి పురుగు తల నుండి స్పిండ్లీ ఫంగస్ మొలకెత్తుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రెండు నుండి ఆరు సెంటీమీటర్ల పొడవు, ఫంగస్ నేల పైన రెమ్మలు వేస్తుంది, హార్వెస్టర్లు కనుగొనడానికి ఒక చిన్న, వేలు ఆకారపు జెండా వలె పని చేస్తుంది.భారతదేశం మరియు భూటాన్లో ఇది 3000 మరియు 5000 మీటర్ల మధ్య ఎత్తులో కనిపిస్తుంది. అలాగే టిబెటన్ పీఠభూమిలో కనిపిస్తుంది .