Balochistan: ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లిన పాకిస్తాన్, 100 మందికి పైగా పాక్‌ సైనికులు మృతి, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చైనా పర్యటన వేళ రక్తసిక్తమైన బలూచిస్తాన్‌

రెండు మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని బలూచిస్తాన్‌లోని వేర్పాటువాద తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఈ ఆత్మాహుతి దాడులకు (2 Pak Military Bases Attacked) తెగబడ్డారు.

Pakistan Prime Minister Imran Khan (Photo- facebook)

Kabul, Feb 3: పాకిస్తాన్ ప్రావిన్స్‌లోని బలూచిస్తాన్‌ (Balochistan )రక్తసిక్తమైంది. రెండు మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని బలూచిస్తాన్‌లోని వేర్పాటువాద తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు ఈ ఆత్మాహుతి దాడులకు (2 Pak Military Bases Attacked) తెగబడ్డారు. పంజూర్‌, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్‌ బాంబర్స్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వింటర్ ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి చైనా పర్యటనకు ముందు (Before PM Imran Khan Heads To China ) ఈ దాడులు జరగడం పాక్‌ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఈ దాడికి పాల్పడింది తామే అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLF) తిరుగుబాటు బృందం రాయిటర్స్ రిపోర్టర్‌కు పంపిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా పాక్‌సైనికలు మరణించినట్లు సమాచారం. కానీ కాగా పాక్ మాత్రం 50మందికి పైగా అని మాత్రమే చెబుతోంది. దీనిపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..ఉగ్రవాద దాడులను మా సైన్యం ధైర్యంగా తిప్పి కొట్టిందని ధైర్య సాహసాలు ప్రదర్శించిన మా భద్రతా బలగాలకు సెల్యూట్ చేస్తున్నాం’ అని ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఐఎస్ఐస్ అగ్ర‌నేత ఖురేషీని హతం చేసిన అమెరికా దళాలు, నార్త్ వెస్ట్ సిరియాలో అల్ ఖురేషీని మ‌ట్టుబెట్టామని తెలిపిన జోబైడెన్

బుధవారం (ఫిబ్రవరి 2,2022) రాత్రి జరిగిన రెండు దాడులను – ఒకటి పంజ్‌గూర్ జిల్లాలోను మరొకటి నౌష్కీ జిల్లాలో జరిగిందని ఆ దాడులను తాము తిప్పికొట్టామని పాక్ సైన్యం తెలిపింది. బలూచిస్తాన్‌లోని సుసంపన్నమైన గ్యాస్, ఖనిజ వనరులను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా దోపిడీ చేస్తుందని, ప్రత్యేక రాష్ట్రం కోసం జాతి బలూచ్ గెరిల్లాలు దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాడుతున్నారు. బటూచ్ గెలిల్లాలు సాధారణంగా గ్యాస్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, భద్రతా దళాలపై దాడులు చేస్తారు. వారు చైనా ప్రాజెక్టులపై కూడా దాడి చేస్తారు. ప్రాజెక్ట్‌లను రక్షించడానికి తాము చేయగలిగినదంతా చేస్తున్నామని తెలిపారు.

బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ చొరవలో భాగమైన $60 బిలియన్ల చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ప్రావిన్స్‌లోని గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకుంది. బలూచిస్థాన్ తిరుగుబాటుదారులకు భారత్ రహస్యంగా మద్దతు ఇస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. దాన్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తోంది.