China: బాబోయ్.. బ్రా లోపల ఐదు బతికున్న పాములను పెట్టుకుని మహిళ స్మగ్లింగ్, చైనా ఎయిర్ పోర్టులో పట్టుబడిన ప్రయాణికురాలు

తాజాగా అలాంటి ఘటనే వార్తల్లో నిలిచింది. ఎయిర్‌పోర్టులో ఓ మహిళ తన బ్రాలో ఐదు బ్రతికున్న పాములను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడింది.

Woman Caught Trying to Smuggle Five Live Snakes in Her Bra (COURTESY OF HUANGGANG CUSTOMS DEPARTMENT)

చాలా విచిత్రమైన పనులు చేయడం, దాని కోసం ఇబ్బందులు పడడం అనేవి సర్వసాధారణం. తాజాగా అలాంటి ఘటనే వార్తల్లో నిలిచింది. ఎయిర్‌పోర్టులో ఓ మహిళ తన బ్రాలో ఐదు బ్రతికున్న పాములను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడింది. మీరు విన్నది నిజమే! పాములన్నీ సజీవంగా ఉన్నాయి. ఆమె శరీరాకృతి విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చి శెంజిన్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది.

కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికాకు చెందిన సదరు మహిళ సజీవంగా ఉన్న ఒక్కో పాముని ఒక్కో స్టాకింగ్ లో పెట్టి ప్యాక్ చేసింది. ఆ ఐదు స్టాకింగ్ బ్యాగులను తన ఛాతీ వద్ద లోదుస్తుల్లో జాగ్రత్తగా పెట్టుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా యధాతధంగా పైన డ్రెస్ వేసుకుంది.ఆమె ఎయిర్ పోర్టులోకి అడుగుపెడుతూనే కస్టమ్స్ అధికారులకు ఆమె ఆకృతి చూసి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అడ్డగించి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఐదు పాములను జెర్రిపోతులుగా గుర్తించి వాటిని జంతు సంరక్షణ శాలకు తరలించారు.

ప్రాణాలు తీసిన మోమో ఛాలెంజ్.. పందెం కాసి 150 మోమోలు తిని ప్రాణాలు కోల్పోయిన యువకుడు.. బీహార్‌లోని చంపారన్ జిల్లాలో ఘటన

ఇదిలా ఉండగా గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో చెన్నై విమానాశ్రయంలో పాములు, కోతులు, తాబేళ్లు ఉన్న బ్యాగులు బయటపడ్డాయి. ఈ బ్యాగులు విమానాశ్రయం యొక్క సామాను క్లెయిమ్ దగ్గర గమనించకుండా వదిలేశారు. బ్యాగును గమనించిన అధికారులు వాటిని పరిశీలించేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత బ్యాగ్‌లోని వస్తువులు దొరికాయి. ఆ సంచిలో 45 బాల్ కొండచిలువలు, మూడు మార్మోసెట్ కోతులు, మూడు నక్షత్ర తాబేళ్లు, ఎనిమిది పాములు ఉన్నాయి.