Coronavirus in China: వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా, మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ ముందు ఉంచిన అమెరికా, కోవిడ్ వైరస్ వ్యాప్తికి ముందే వుహాన్‌ ల్యాబ్ శాస్త్రవేత్తలకు అస్వస్థత ఉందని రిపోర్ట్‌

సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ ముందు అమెరికా ఉంచిది.

Wuhan Institute of Virology/ Representative image

Washington, May 24: కరోనావైరస్ పుట్టుక మీద ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉండగా..తాజాగా చైనాలోని వుహాన్‌ ల్యాబ్ (China's Wuhan Lab) విషయంలో మరో సంచలన వార్త బయటకు వచ్చింది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ ముందు అమెరికా ఉంచిది. దీంతో వైరస్‌ (COVID-19 Outbreak) ఇక్కడి నుంచే పుట్టుకొచ్చిందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థల నివేదికల ఆధారంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఒక కథనాన్ని ప్రచురింది.

కరోనా విజృంభణ మొదలుకాక ముందు.. నవంబర్‌ 2019లో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు (China's Wuhan Lab Researchers) తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వాళ్లను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వాళ్లు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నవిషయాన్ని ల్యాబ్‌ (Wuhan Institute of Virology) చాలా గోప్యంగా ఉంచింది. అంతేకాదు ఆ ఆస్పత్రి బయట ఎవర్నీ కలవనీయకుండా గట్టి కాపలా ఉంచింది.

వీరిందరిలో కొవిడ్‌19 లేదా సాధారణ ఫ్లూలో కనిపించే జ్వరం, పొడిదగ్గు వంటి లక్షణాలు ఉన్నాయి. అమెరికన్‌ నిఘా వర్గాలు ఈ వివరాలతో సమగ్రంగా ఒక రిపోర్ట్‌ తయారు చేశాయి. అత్యంత చాతుర్యంతో చాలా కచ్చితమైన సమాచారం వెల్లడించినట్లు కొందరు అధికారులు వాల్‌స్ట్రీట్‌తో పేర్కొన్నారు. కానీ, వారు ఎందుకు జబ్బుపడ్డారో కారణం మాత్రం తెలియలేదని తెలిపారు.

మరో కొత్త షాక్, డిసెంబర్‌కు ముందే చైనాలో కరోనా, వుహాన్‌లో 13 రకాల కోవిడ్ స్ట్రెయిన్లు, SARS-COV-2కు సంబంధించి 13 ర‌కాల జ‌న్యు క్ర‌మాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ

తాజాగా డబ్ల్యూహెచ్‌వో డెషిషన్‌ మేకింగ్‌ బాడీ మీటింగ్‌లో ఈ రిపోర్ట్‌ ప్రస్తావనకు వచ్చింది. దీంతో కరోనా పుట్టుక గురించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ రిపోర్ట్‌ను ప్రధానంగా పరిశీలించాలని డబ్ల్యూహెచ్‌వో ప్యానెల్‌ డిసైడ్‌ నిర్ణయించుకుంది. ఈ విషయాల్ని ప్రముఖ అమెరికన్‌ పత్రిక వాషింగ్టన్‌ డీసీ ప్రచురించింది. ఈ అనుమానాలన్నీ ‘కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌’ సృష్టే అనే వాదనను బలపరుస్తున్నాయని ఆ పత్రిక తెలిపింది.

అయితే చైనా మాత్రం అమెరికా ఆరోపణలను ఖండిస్తోంది. ‘అమెరికా ఎక్కువ చేస్తోందని, ఈ ఆరోపణలు దర్యాప్తును పక్కదారి పట్టించేలా ఉన్నాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీల్యాండ్‌లో ఫోర్ట్‌ డెట్రిక్‌ మిలిటరీ బేస్‌ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా ఇది వరకే డబ్ల్యూహెచ్‌వోకి ఒక రిపోర్ట్‌ అందజేసింది కూడా. అయితే వుహాన్‌ ల్యాబ్‌ రీసెర్చర్ల ట్రీట్‌మెంట్‌ గురించి ట్రంప్‌ హయాంలోనే రిపోర్ట్‌ తయారైనప్పటికీ.. బైడెన్‌ కార్యాలయం మాత్రం ఈ ఇష్యూపై స్పందించట్లేదు.

వుహాన్ ల్యాబ్ నుంచి కరోనావైరస్ బయటకు, హాంకాంగ్‌కు శాస్త్రవేత్త లీ మెంగ్‌ సంచలన వ్యాఖ్యలు, బయటకు చెబితే కనిపించకుండా పోతావని బెదిరించారని వెల్లడి

2019 అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య డెబ్భై ఆరువేల మంది సీజనల్‌ జబ్బుల బారినపడ్డారు. వాళ్లలో యాంటీ బాడీస్‌ కోసం 92 మందిని మాత్రమే చైనా పరీక్షించింది. ఈ విషయం డబ్ల్యూహెచ్‌వో దృష్టికి రావడంతో వాళ్ల రిపోర్ట్‌లు కోరింది. అయితే గోప్యతను సాకుగా చూపెడుతూ చైనా అందుకు నిరాకరించింది. ఇక వుహాన్‌ ల్యాబ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ రిపోర్ట్‌లను సైతం ఇచ్చేందుకు చైనా మొదట అంగీకరించకపోగా.. డబ్ల్యూహెచ్‌వో ఒత్తిడితో దిగొచ్చింది. కానీ, ఇప్పటిదాకా ఎలాంటి రిపోర్టులు సమర్పించలేదని తెలుస్తోంది. అయితే శరదృతువు కాలంలో వుహాన్‌ రీసెర్చ్‌లు సీజనల్‌ జబ్బులు పడడం సర్వసాధారణమని డచ్‌ వైరాలజిస్ట్‌ మరియోన్‌ చెబుతోంది.

గబ్బిలాల ద్వారా కరోనావైరస్, ఎట్టకేలకు వైరస్ పుట్టుక మీద స్పందించిన చైనా, ఇంకా బయటకు రాని డ‌బ్ల్యూహెచ్‌వో రిపోర్టు, దౌత్య‌వేత్త ద్వారా నివేదికను సంపాదించిన అసోసియేటెడ్ ప్రెస్ ఏజెన్సీ

ఇన్ని ఆరోపణలు వస్తున్నా వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ మాత్రం రా డేటా, సేఫ్టీ లాగ్స్‌, గబ్బిలాల్లోని కరోనావైరస్‌లపై పరిశోధనలు చేసిన ల్యాబ్‌ రికార్డులను మాత్రం ఎవరికీ ఇవ్వడంలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పంపిన నిపుణుల బృందం చైనాలో 76,000 కొవిడ్‌ కేసుల్లో 92 మంది అక్టోబర్‌-డిసెంబర్‌ మొదటి వారం మధ్యలో అస్వస్థకు గురైనట్లు గుర్తించింది. వారి డేటాను ఇవ్వాలని కోరగా చైనా తిరస్కరించింది. ఇక వుహాన్‌లోని బ్లడ్‌బ్యాంక్‌ నమూనాలు ఇవ్వాలని .. వాటిల్లో 2019 డిసెంబర్‌ కంటే ముందు నమూనాలను పరిశీలిస్తామని పేర్కొంది. కానీ, వ్యక్తుల ప్రైవసీకి భంగం కలుగుతుందని తొలుత పేర్కొంది. ఆ తర్వాత ఇచ్చేందుకు అంగీకరించినా.. ఆ నమూనాలు పరిశీలించే అవకాశం ఇప్పటి వరకూ నిపుణులకు కల్పించలేదు.

గతేడాది మార్చిలో హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నాటి విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. ‘‘ లెవల్‌ 3 ల్యాబ్‌లో చాలా రక్షణ ఉంటుంది. అక్కడ కరోనా వైరస్‌లపై పనిచేస్తున్న ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరిలో ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలు ఉన్నాయి. వీరంతా ఒకే వారంలో తీవ్ర అస్వస్థకు గురి కావడం కానీ, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడంగానీ జరిగింది. పరిశోధకులు జబ్బుపడటమే మొదటి క్లస్టర్‌ కావచ్చు’’ అని పేర్కొన్నారు. పాంపియో గతంలో నిఘా సంస్థ సీఐఏ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన ఎంత మంది జబ్బుపడ్డారో కూడా అంకెతో సహా చెప్పారు.