coronavirus in idnia (Photo-PTI)

Wuhan, Feb 16: చైనాలోని వుహాన్‌లో కరోనావైరస్ పుట్టిందని ప్రపంచం మొత్తం విశ్వసిస్తోంది. అయితే చైనా మాత్రం దీనిని ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. చైనా ప్రపంచానికి తెలియకుండా కరోనావైరస్ మీద అనేక విషయాలను దాచి ఉంచిందని డబ్ల్యూహెచ్‌ఓ (World Health Organisation) పరిశోధకుల బృందానికి నాయకత్వం వహించిన పీటర్ బెన్ తెలిపారు. ప్రముఖ న్యూస్ ఛానల్ సీఎన్ఎన్ కి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. కాగా చైనాలోని వుహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ (Wuhan Coronavirus) ఆన‌వాళ్లను గుర్తించేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు వెళ్లిన విష‌యం తెలిసిందే.

డ‌బ్ల్యూహెచ్‌వో బృందం ముఖ్య అధికారి పీట‌ర్ బెన్ ఎంబారెక్ ఓ అంతర్జాతీయ మీడియతో మాట్లాడుతూ.. 2019 డిసెంబ‌ర్‌లో వుహాన్‌లో చాలా విస్తృత స్థాయిలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లిన‌ట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ న‌గ‌రంలో ఉన్న ప్ర‌జ‌ల నుంచి ల‌క్ష‌ల సంఖ్య‌లో ర‌క్త న‌మోనాల‌ను ప‌రీక్షించాల‌ని..అయితే అది జరగలేదని తెలిపారు. వుహాన్ న‌గ‌రంలో వైర‌స్ సోకిన ప్ర‌జ‌లంద‌రికీ చైనా ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌లేద‌ని ఆయన ఆరోపించారు.

కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే వుహాన్‌ ఎంజాయ్ చేస్తోంది, మాస్క్ లేకుండా వుహాన్‌ వాటర్ పార్కులో వేలాది మంది జనం, మాయా బీచ్ పార్క్‌లో విద్యుత్ వెలుగుల మ్యూజిక్ పార్టీ

2019 డిసెంబ‌ర్‌లోనే వుహాన్‌లో 13 రకాల క‌రోనా వైర‌స్ స్ట్రెయిన్లు (Wuhan already had 13 variants of Covid) ఉన్న‌ట్లు గుర్తించామ‌ని డాక్ట‌ర్ పీట‌ర్ బెన్ తెలిపారు. చైనా అధికారులు ప‌రిచ‌యం చేసిన తొలి క‌రోనా పేషెంట్‌తో మాట్లాడిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అతనికి ఎటువంటి ట్రావెల్ హిస్ట‌రీ లేదని.. ఆ వ్య‌క్తికి డిసెంబ‌ర్ 8వ తేదీన క‌రోనా సోకిన‌ట్లు నిర్ధారించారు. 2019 డిసెంబ‌ర్ క‌న్నా ముందు నుంచే వుహాన్‌లో చాలా విస్తృత స్థాయిలో వైర‌స్ వ్యాపించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో శాస్త్ర‌వేత్త‌ల‌కు అంచ‌నాకు వ‌చ్చారు. డిసెంబ‌ర్‌లో న‌మోదు కేసుల‌కు సంబంధించిన జ‌న్యుప‌దార్ధాల‌ను ప‌రిశీలించిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

డ‌బ్ల్యూహెచ్‌వోల‌ని 17 మంది, చైనాకు చెందిన 17 మంది శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా ర‌కాల జ‌న్యువుల‌ను అధ్య‌య‌నం చేసిన‌ట్లు ఆయన వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 2019 నుంచి సార్స్ సీఓవో2కు (SARS-COV-2 virus) సంబంధించి 13 ర‌కాల జ‌న్యు క్ర‌మాల‌ను గుర్తించిన‌ట్లు పీట‌ర్ బెన్ తెలిపారు. ఒక‌వేళ చైనా రోగుల డేటాతో ఈ జ‌న్యు సీక్వెన్సుల‌ను ప‌రిశీలిస్తే, అప్పుడు ఆ మ‌హ‌మ్మారి ఎక్క‌డ పుట్టింది.. ఎప్పుడు ప్ర‌బ‌లింద‌న్న అంచ‌నాలు వేసే వీలు ఉంటుంద‌ని బెన్ చెప్పారు. వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌, ఇత‌ర ప్రాంతాల నుంచి సేక‌రించిన న‌మోనాల‌ను ప‌రిశీలించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

వుహాన్ ల్యాబ్ నుంచి కరోనావైరస్ బయటకు, హాంకాంగ్‌కు శాస్త్రవేత్త లీ మెంగ్‌ సంచలన వ్యాఖ్యలు, బయటకు చెబితే కనిపించకుండా పోతావని బెదిరించారని వెల్లడి

డిసెంబర్ నాటికి వుహాన్‌లో ఈ వ్యాధికి 1,000 కేసులు ఉండవచ్చునని ఆయన సూచించారు. 2019 డిసెంబర్‌లో వుహాన్ ప్రాంతంలో దాని సమీపంలో 174 కేసుల కరోనావైరస్ కేసులను చైనా అధికారులు గుర్తించినట్లు ఎంబారెక్ తెలిపారు, వీటిలో 100 కేసులను ప్రయోగశాల పరీక్ష ద్వారా నిర్ధారించారు, మిగిలిన కేసులను రోగుల లక్షణాల క్లినికల్ డయాగ్నసిస్ ద్వారా గుర్తించారు.

ఇదిలా ఉంటే ఈ విషయం మీద ఆయన మరింత లోతుగా మాట్లాడటానికి నిరాకరించారు. చైనాలో వైరస్ పుట్టిందని ప్రపంచం విశ్వసిస్తున్నా..దానిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని నివేదికలు ఈ వ్యాధి ఐరోపాలో అక్టోబర్ ప్రారంభంలోనే ఉన్నాయని సూచిస్తున్నాయి. నవంబర్‌లో మిలన్‌లో నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ (ఐఎన్‌టి) విడుదల చేసిన ఒక అధ్యయనంలో కొత్త కరోనావైరస్ 2019 సెప్టెంబర్‌లో ఇటలీలో తిరుగుతున్నట్లు తేలింది.

వుహాన్‌ కరోనా చావుల మిస్టరీ, కరోనా వల్ల వుహాన్‌లో 42 వేల మందికి పైగా మృతి, 3200 మంది చనిపోయారంటూ చైనా అధికారిక ప్రకటన, RFA కథనంలో నిజమెంత ?

చైనాలో దాదాపు 15 శాతం మందిలో ఈ వైరస్ తీవ్రమైనల లక్షణాలను కలిగించిందని..చాలామందికి తేలికపాటి లక్షణాలతో ఈ వైరస్ వచ్చి వెళ్లిందని తెలిపారు. 2019 లో చైనా అంతటా ఇతర రోగుల డేటాతో పాటు పరిశీలించిన 13 వేరియంట్లు వ్యాప్తి యొక్క మూలానికి కీలకమైన ఆధారాలను అందించగలవని మిస్టర్ ఎంబారెక్ చెప్పారు. కాగా బయట దేశాల జంతువుల నుండి మనుషుల వైపుకు వెళ్లిన వైరస్ గా దీనిని నిర్థారించుకోలేమని, చైనా లోపల ఈ వైరస్ భారీ స్థాయిలో ఉందని అయితే దీనిని నిర్థారించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.