Chinese Missiles: కయ్యానికి కాలుదువ్వతున్న డ్రాగన్ కంట్రీ, జపాన్ భూభాగంలోకి మిస్సైల్స్ ప్రయోగించిన చైనా, తైవాన్ సమీపంలో బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగం, జపాన్ ఎకనామిక్ జోన్‌లో పడ్డ ఐదు మిసైల్స్
తైవాన్ లక్ష్యంగా చైనా (China) ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు (missiles) జపాన్ ఎక్స్లూజివ్ ఎకనమిక్ జోన్‌లో (Japan's exclusive economic zone)పడినట్టు భావిస్తున్నామని జపాన్ రక్షణ మంత్రి నొబువ కిషి చేసిన ప్రకటన కలకలం రేపింది.
Beijing, AUG 05: తైవాన్ లక్ష్యంగా చైనా (China) ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు (missiles) జపాన్ ఎక్స్లూజివ్ ఎకనమిక్ జోన్‌లో (Japan's exclusive economic zone)పడినట్టు భావిస్తున్నామని జపాన్ రక్షణ మంత్రి నొబువ కిషి చేసిన ప్రకటన కలకలం రేపింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi) తైవాన్ పర్యటన నేపధ్యంలో తైవాన్ (Taiwan) సమీపంలో చైనా సైనిక విన్యాసాల నడుమ జపాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చైనా ప్రయోగించిన తొమ్మిది క్షిపణుల్లో ఐదు బాలిస్టిక్ క్షిపణులు జపాన్ (JAPAN) ఎకనమిక్ జోన్‌లో ల్యాండ్ అయ్యాయని నొబువ కిషి (Nobuo Kishi) చెప్పుకొచ్చారు.
జపాన్ తూర్పు ద్వీప ప్రాంతం ఒకినవ తైవాన్‌కు సమీపంలో ఉంటుంది. చైనా మిసైల్స్ (Chinese missiles) తమ భూభాగంలో పడటంపై కిషి తీవ్రంగా ఆక్షేపించారు. దౌత్య వర్గాల ద్వారా చైనాకు జపాన్ తన నిరసనను తెలియపరిచిందని, ఇది తీవ్రమైన అంశమని, తమ జాతీయ భద్రత, పౌరుల భద్రతపై ప్రభావం చూపుతుందని కిషి పేర్కొన్నారు. కాగా, తైవాన్ సమీపంలో చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడంపై భగ్గుమంటున్న డ్రాగన్ ఇవాళ తైవాన్ తీరంలో బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించినట్టు సమాచారం. పలు డాంగ్‌ఫెంగ్ బాలిస్టిక్ మిస్సైళ్లను తైవాన్ నార్త్ఈస్ట్ జలాల్లో ప్రయోగించినట్లు చైనా పేర్కొన్నది. తైవాన్ రక్షణ శాఖ కూడా ఈ మిస్సైళ్ల పరీక్షను ద్రువీకరించింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ డాంగ్‌ఫెంగ్ మిస్సైళ్లను ఆపరేట్ చేస్తుంది. ఆ క్షిపణులను ప్రయోగించిన సమయంలో తాము డిఫెన్స్ సిస్టమ్‌లను యాక్టివేట్ చేసినట్లు తైవాన్ రక్షణశాఖ చెప్పింది. చైనా అక్రమ చర్యలకు పాల్పడుతోందని, ప్రాంతీయ శాంతికి ఇబ్బంది కలగచేస్తోందని తైవాన్ ఆరోపించింది.