H9n2 Outbreak in China: చైనాలో కొత్త వైరస్, భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేద‌ని స్పష్టం చేసిన విదేశాంగ శాఖ, హెచ్‌9ఎన్‌2 వైర‌స్ కారణంగా భారీగా పెరిగిన న్యూమోనియా కేసులు

చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసుల‌తో భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

(Photo Credits: Pixabay)

Government Closely Monitoring H9n2 Outbreak in China: చైనాలో ప్ర‌స్తుతం హెచ్‌9ఎన్‌2 వైర‌స్ కేసులు( H9N2 Cases) భారీగా పెరుగుతున్నాయి.అయితే ఈ అంశంపై ఇవాళ భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసింది. చైనాలో ఉన్న హెచ్9ఎన్1 కేసుల‌తో భార‌త్‌కు ఎటువంటి రిస్క్ లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఏవియ‌న్ ఇన్‌ప్లుయాంజా కేసుల‌తో పాటు, శ్వాస‌కోస వ్యాధుల సంఖ్య చైనాలో పెరుగుతున్నాయి. చిన్నారుల్లోనే ఈ ల‌క్ష‌ణాలు అధికంగా క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌త స‌ర్కారు ప్ర‌క‌ట‌న చేయాల్సి వ‌చ్చింది. ఎటువంటి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

చైనాను వణికిస్తున్న మరో కొత్త వ్యాధి, అంతుచిక్కని న్యుమోనియాతో ఆస్పత్రిపాలైన వేలాది మంది పిల్లలు, కరోనా సంక్షోభాన్ని గుర్తుకు తెస్తున్న కొత్త వ్యాధి

చిన్నారుల్లో నుమోనియా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఉత్త‌ర చైనాలో ఆ కేసుల సంఖ్య ఆందోళ‌న‌క‌రంగా ఉంది. పిల్ల‌ల్లో న‌మోదు అవుతున్న నుమోనియా కేసుల‌కు కొత్త త‌ర‌హా ప్యాథోజ‌న్‌తో లింకు లేద‌ని చైనా వెల్ల‌డించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో ఓ మీడియా స‌మావేశంలో పేర్కొన్న‌ది. అక్టోబ‌ర్ నుంచి చైనా పిల్ల‌ల్లో శ్వాస‌కోశ వ్యాధులు న‌మోదు అవుతున్న‌ట్లు డేటా ప్ర‌కారం తెలుస్తోంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే వ్యాధుల‌కు సంబంధించిన మ‌రింత డేటాను ఇవ్వాల‌ని చైనాను కోరిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో పేర్కొన్న‌ది.