Tarawih: సౌదీలో కనిపించిన నెలవంక, సోమవారం నుంచే అక్కడ రంజాన్ ఉపవాసదీక్షలు, భారత్‌ సహా కొన్ని దేశాల్లో మాత్రం మంగళవారం నుంచి మొదలు కానున్న రంజాన్ మాసం

రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఉదయం సూర్యోదయానికి ముందే ఉపవాస దీక్ష ప్రారంభిస్తూ ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.

Ramzan Mubarak | Representational Image | (Photo Credits: Pixabay)

Dubai, March 10: సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి నెలవంక కనిపించింది. దీంతో సోమవారం నుంచి సౌదీ అరేబియాతోపాటు (Saudi Arabia) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్ (UK), అమెరికా తదితర పశ్చిమ దేశాల్లోని ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. మంగళవారం నుంచి భారత్‌, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల్లో ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు.

రంజాన్ మాసంలో ప్రతి రోజూ ఉదయం సూర్యోదయానికి ముందే ఉపవాస దీక్ష ప్రారంభిస్తూ ప్రార్థనలు చేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు.