Viral Video on Trump: అమెరికా అధ్యక్షునికి కరోనా పాజిటివ్ వచ్చిందా..?, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, అసలు ఈ వార్తలో నిజమెంత..?
ఆయనకు కోవిడ్ 19 (COVID-19) పరీక్షలు చేస్తే అది పాజిటివ్ అని వచ్చిందా...దీనిపై సోషల్ మీడియాలో ఓ వీడియో (Fake Video in Social Media) చక్కర్లు కొడుతోంది. ఫాక్స్ న్యూస్ పేరుతో ట్రంప్ కు కరోనా పాజిటివ్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి పుకారు ప్రచారకులు ఫాక్స్ న్యూస్ యొక్క న్యూస్ క్లిప్‌ను అటు ఇటూగా మార్చి సోషల్ మాడియా ద్వారా వైరల్ చేశారు. వాస్తవ తనిఖీలో అది ఫేక్ అని తేలింది.
Washington, May 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కరోనా భారీన పడ్డారా.. ఆయనకు కోవిడ్ 19 (COVID-19) పరీక్షలు చేస్తే అది పాజిటివ్ అని వచ్చిందా...దీనిపై సోషల్ మీడియాలో ఓ వీడియో (Fake Video in Social Media) చక్కర్లు కొడుతోంది. ఫాక్స్ న్యూస్ పేరుతో ట్రంప్ కు కరోనా పాజిటివ్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి పుకారు ప్రచారకులు ఫాక్స్ న్యూస్ యొక్క న్యూస్ క్లిప్‌ను అటు ఇటూగా మార్చి సోషల్ మాడియా ద్వారా వైరల్ చేశారు. వాస్తవ తనిఖీలో అది ఫేక్ అని తేలింది. హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్ 19 మనతో ఉంటుంది, కలిసి జీవించడం నేర్చుకోవాలి, దేశాలన్నీ జాగ్రత్తగా వ్యవహరించాలి, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ట్విట్టర్ మరియు వాట్సాప్‌లో షేర్ చేసిన 11 సెకన్ల వీడియో క్లిప్, ఫాక్స్ న్యూస్ యాంకర్ ట్రంప్ కరోనావైరస్ పరీక్ష నిర్వహిస్తే అందులో పాజిటివ్ వచ్చినట్లు వైట్ హౌస్ అధికారులు ధృవీకరించారని చెప్పారు. వీడియోను పరిశీలించినప్పుడు, నకిలీ వార్తలను ప్రదర్శించడానికి రెండు వేర్వేరు ప్రకటనలు అందులో విలీనం చేయబడినట్లు కనుగొనబడింది.
వీడియో ప్రారంభంలో ముందు, యాంకర్ "వైట్ హౌస్ అధికారులు ప్రెసిడెంట్ ట్రంప్‌ను కరోనా నెగిటివ్ గా ధృవీకరించారు" అని చెప్పడం వినవచ్చు. వీడియో ఎడిటింగ్ ద్వారా జతచేయబడిన క్లిప్ యొక్క రెండవ భాగంలో ట్రంప్ కు కరోనా పాజిటివ్ వచ్చిందని యాంకర్ చెబుతున్నట్లుగా చెప్పవచ్చు. ఈ వార్తలను వైరల్ చేయడానికి వీడియోని రెండు భాగాలుగా తయారుచేశారు. ఆ తర్వాత దాన్ని ఒకటిగా చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇదంతా ఫేక్ అని చెప్పవచ్చు.
Fake Video Circulated on Twitter
కాగా వైట్ హౌస్ యొక్క అధికారిక పత్రికా ప్రకటన ద్వారా అటువంటి ప్రకటన ఏదీ జారీ చేయబడలేదని గమనించాలి. యుఎస్ యొక్క ఏ మీడియా సంస్థ కూడా ఈ విషయాన్ని నివేదించలేదు. కాగా నేను రోజూ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వేసుకుంటున్నా. నాకు వైరస్ లక్షణాలు లేవు. అయినప్పటికీ ఈ ఔషధం గురించి వైట్‌హౌస్ వైద్యులను సంప్రదించా. వారు సూచించనప్పటికీ పది రోజులుగా రోజుకు ఒక మాత్ర చొప్పున వేసుకుంటున్నా. నాకు అంతా బాగానే ఉన్నది. త్వరలో దీన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు.