Elon Musk on 2024 US Elections Results: గేమ్ సెట్‌ అండ్‌ మ్యాచ్‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్, ట్రంప్ జోరు చూస్తుంటే ప్రభుత్వ సలహాదారు పదవి లాంఛనమే..

ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మరియు డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.

Elon Musk and Trump (Photo-Wikimedia commons)

Donald Trump US Election Results LIVE Updates: 2024 ఎన్నికలలో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ మరియు డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురవుతోంది.అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రెసిడెంట్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళుతున్నారు.

ట్రంప్ గెలుపు దిశగా సాగుతుండడంపై టెస్లా చీఫ్, బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందించారు. టెన్నిస్ మ్యాచ్ లో ఉపయోగించే భాషలో ట్రంప్ గెలుపు, ప్రత్యర్థి ఓటమి ఖాయమైందనే అర్థంలో ట్వీట్ చేశారు. ‘గేమ్, సెట్ అండ్ మ్యాచ్’ అంటూ బుధవారం ఉదయం మస్క్ ట్వీట్ చేశారు. సాధారణంగా టెన్నిస్ మ్యాచ్ లో ఓ ఆటగాడు గెలిచాడు అనేది చెప్పడానికి సోషల్ మీడియాలో ఈ పదాలు ఉపయోగిస్తుంటారు.

దూసుకుపోతున్న ట్రంప్, మరో 31 ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే అమెరికా అధ్యక్ష పీఠం సొంతం, రెండు యుద్దభూముల్లో జెండా పాతిన రిపబ్లికన్ పార్టీ

రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు మస్క్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ట్రంప్ కోసం మస్క్ ప్రచారం కూడా చేశారు. ట్రంప్ గెలవకుంటే అమెరికాలో ఇవే ఆఖరి ఎన్నికలు అవుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో ఎలక్షన్ ఫండ్ సమకూర్చారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి, రిపబ్లికన్ పార్టీవైపు ఆకర్షించడానికి పలు లాటరీ స్కీములు పెట్టి పరోక్షంగా ట్రంప్ కు ప్రచారం చేశారు.

Elon Musk Tweets

ఎన్నికల ప్రచారంలో ఎలాన్ మస్క్ ను ట్రంప్ ఆకాశానికి ఎత్తేశారు. మస్క్ గొప్ప బిజినెస్ మ్యాన్ అని, ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించడంలో మస్క్ మేటి అని కొనియాడారు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక మస్క్ కు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెడతానని ట్రంప్ పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు