Earthquake: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఈరోజు మరోసారి భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1 నమోదు, వణికిస్తున్న వరుస భూప్రకంపనలు
భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తికి నష్టం జరగలేదు. ఈ వారం ఈ ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండోసారి....
Karachi, September 26: గురువారం మధ్యాహ్నం 12:31 గంటలకు భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి భూకంపం సంభవించింది. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తికి నష్టం జరగలేదు. ఈ వారం ఈ ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండోసారి.
మంగళవారం రోజు పాకిస్థాన్ లోని పలు ప్రాంతాలు, ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు సహా ఉత్తర భారత దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో భూమి కంపించింది. అయితే ఈ భూకంపం పాకిస్థాన్ లో తీవ్ర నష్టాన్ని కలుగజేసింది, మొన్నటి భూకంపం కారణంగా పాకిస్థాన్ లోని మిర్పూర్ లో ఒక భవంతి కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 37కు చేరింది. రోడ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. నేడు మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు.
ANI Tweet
కొద్దిసేపటి క్రితం పాకిస్థాన్ లో సంభవించిన భూకంపం ఆనవాళ్లకు సంబంధించిన దృశ్యాలు
2015 అక్టోబర్ లో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం వలన పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లలో దాదాపు 400 మంది మరణించారు. ఇక 14 ఏళ్ల క్రితం 2005 అక్టోబర్ 8న వచ్చిన భూకంపం పాకిస్థాన్ లో అత్యంత విషాదకరమైన సంఘటనగా చెప్పవచ్చు. అప్పట్లో 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 90,000 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.