Earthquake Representational Image- PTI

New Delhi, September 24:  దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ఢిల్లీ- NCR ప్రాంతంలో బలమైన భూప్రకంపనాలు (Strong Tremors)  సంభవించాయి.

ప్రాథమికంగా అందుతున్న నివేదికల ప్రకారం, ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్లతో సహా పరిసర ప్రాంతాలలో భూమి కంపించింది.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం పాకిస్తాన్ లోని లాహోర్ కు 173 కిలోమీటర్ల వాయువ్య దిశలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది.

Early Reports

పాకిస్తాన్ - ఇండియా బార్డర్ వద్ద కూడా జమ్మూ కాశ్మీర్ రీజియన్ లో కూడా 6.3 తీవ్రతతో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని రిపోర్ట్స్ అందుతున్నాయి. పాకిస్థాన్ లోని పలు చోట్ల కూడా భూప్రకంపనలు నమోదైనట్లు పాక్ స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

పాకిస్థాన్‌లో భారీ నష్టం?

అయితే ఈరోజు సంభవించిన భూకంప తీవ్రత పాకిస్థాన్ పై ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. పాక్ లో చాలా చోట్ల భూమిపై, రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి, చాలా భవనాలు దెబ్బతిన్నాయి.  భారత్ సరిహద్దుకు సమీపంలో ఉండే లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ మొదలగు ప్రాంతాలలో తీవ్రమైన భూప్రకంపనాలు చోటు చేసుకున్నాయి.

పాక్ మీడియాలో భూకంపంపై వచ్చిన వార్త

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ప్రాణనష్టంకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం కారణంగా పాకిస్థాన్ లోని, మిర్పూర్ లో ఒక భవంతి కూలి కనీసం 50 మంది గాయపడ్డారని పాకిస్థాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరిన్ని లైవ్ బ్రేకింగ్ న్యూస్‌ల కొరకు ఈ లింక్‌‌పై క్లిక్ చేయండి .

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భూకంపం వల్ల పాకిస్థాన్ లో  సుమారు 19 మంది చనిపోగా, మరో 300 గాయాలయ్యాయని తెలుస్తుంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.