Elon Musk Meets PM Modi: మోదీకి నేను పెద్ద ఫ్యాన్ ను, త్వరలోనే భారత్‌లో పర్యటిస్తానన్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, న్యూయార్క్‌లో ప్రధాని మోదీతో భేటీ అయిన ఎలాన్ మస్క్
మస్క్ తనను తాను మోదీ అభిమాని అని కూడా చెప్పుకున్నారు.(Calls Himself Fan of Modi) భారత ప్రధాని మోదీ నాయకత్వాన్ని మస్క్ ప్రశంసించారు. ‘‘భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.
NewYork, June 21: అమెరికా దేశ పర్యటనలో భాగంగా బుధవారం న్యూయార్క్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోదీని టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ కలిశారు. మస్క్ తనను తాను మోదీ అభిమాని అని కూడా చెప్పుకున్నారు.(Calls Himself Fan of Modi) భారత ప్రధాని మోదీ నాయకత్వాన్ని మస్క్ ప్రశంసించారు. ‘‘భారతదేశ భవిష్యత్తు గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ప్రపంచంలోని ఏ పెద్ద దేశం కంటే భారత్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ భారతదేశం గురించి నిజంగా శ్రద్ధ వహిస్తారు, ఎందుకంటే మోదీ పెట్టుబడులు పెట్టడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. నేను మోదీ అభిమానిని. ఇది అద్భుతమైన సమావేశం.నాకు మోదీ అంటే చాలా ఇష్టం’’ అని ఎలోన్ మస్క్ ట్వీట్(Elon Musk tweet) చేశారు.
ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఎలోన్ మస్క్ భారత్‌లో పర్యటించాలని తన కోరికను వ్యక్తం చేశారు.(PM Modi US Visit 2023) వచ్చే ఏడాది తాను భారతదేశాన్ని సందర్శిస్తానని చెప్పారు.టెస్లా సీఈఓ మోదీతో తన సమావేశాన్ని సంభాషణ అద్భుతమైనదని అన్నారు.స్పేస్‌ఎక్స్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ అయిన స్టార్‌లింక్‌ను భారత్‌కు తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇంటర్నెట్ యాక్సెస్ లేని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇది సహాయపడుతుందని మస్క్ చెప్పారు.మస్క్‌తో పాటు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత నీల్ డి గ్రాస్సే టైసన్, నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త పాల్ రోమర్, రచయిత నికోలస్ నాసిమ్ తలేబ్, పెట్టుబడిదారుడు రే డాలియోలు మోదీని కలిసిన వారిలో ఉన్నారు.