Big Blow To Pakistan: పాకిస్థాన్ దేశానికి భారీ ఎదురుదెబ్బ! పాకిస్థాన్‌ను 'బ్లాక్ లిస్ట్'లో చేర్చిన FATF. మరింత దిగజారనున్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి. ఇది భారత్ చేసిన కుట్రేనని ఆరోపించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

ఆ దేశ ప్రధాని ఆ దేశం, ఈ దేశం తిరుగుకుంటూ పాకిస్థాన్ కు ఆర్థిక సహాయం అందించాలంటూ తిరుగుతున్నారు. ఇటీవల, గూగుల్ లో కూడా 'బికారీ' (బిచ్చగాడు) అని సెర్చ్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ చిత్రాన్ని చూపించింది.

Pakistan Prime Minister Imran Khan | File photo | (Photo Credits: PTI)

Sydney, Canberra, August 23: మింగ మెతుకు లేదు గానీ, మీసాలకు సంపెంగ నూనె అనే సామెత పాకిస్థాన్‌కు సరిగ్గా సరిపోతుంది. తన దేశ ప్రజలనే పోషించలేని పాకిస్థాన్, తన స్థాయిని మరిచి కాశ్మీర్ తమది అంటూ అంతర్జాతీయంగా ప్రచారం చేసుకుంటుంది. ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలతో ఘోరంగా భంగపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ దేశానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో పాకిస్థాన్‌ను గ్రేలిస్టులో చేర్చిన ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF), శుక్రవారం 'బ్లాక్ లిస్ట్'(Enhanced Expedited Follow Up List) లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ దేశం, నిండా అప్పులు చేస్తూనే కాలం వెల్లదీస్తుంది. ఆ దేశ ప్రధాని ఆ దేశం, ఈ దేశం తిరుగుకుంటూ పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం అందించాలంటూ కోరుతున్నారు. ఇటీవల, గూగుల్‌లో కూడా 'బికారీ' (బిచ్చగాడు) అని సెర్చ్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ చిత్రాన్ని చూపించింది.

అంతగా దిగజారిపోయినా సరే పాకిస్థాన్ మాత్రం తన పంథాను మార్చుకోవడం లేదు, సరైన మార్గంలో వెళ్లడం లేదు. కాశ్మీర్ అంశంలో ప్రజల భావోద్వేగాలు పెంచేలా అబద్ధపు ప్రచారాలు, వక్ర భాష్యాలు, రెచ్చగొట్టే చర్యలకు దిగుతుంది. ఆ దేశ ఖజానానంతా ఉగ్రవాదులకు, సైనిక పోషణకే ఉపయోగిస్తుంది. పాకిస్థాన్ ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తుందనే అభియోగంతో గతంలోనే (FATF) ఆ దేశాన్ని "గ్రే లిస్టు"లో చేర్చింది. అప్పటికైనా బుద్ధి మారని పాకిస్థాన్, ఇక భవిష్యత్తులో మరింత దిగజారే పరిస్థితులను కొని తెచ్చుకుంది.

FATF అంతర్జాతీయంగా వివిధ దేశాల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే ఒక సంస్థ. ఒకసారి ఇది గనక ఏదైనా దేశాన్ని గ్రేలిస్ట్ చేసిందంటే ఆ దేశానికి ఇతర దేశాలు ఆర్థిక సహాయాన్ని అందించడం తగ్గిస్తాయి, ఇక బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అంటే ఆ దేశానికి ఆర్థిక సహాయాలు పూర్తిగా నిలిపివేయాలని అని అర్థం. పాకిస్థాన్ మనీలాండరింగ్‌‌కు పాల్పడుతుంది. డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తుంది. కాబట్టి ఎవరూ దానికి ఆర్థిక సహాయం చేయకూడదు అని ఒక విధమైన హెచ్చరిక లాంటింది.   FATF కు చెందిన ఏసియా పసిఫిక్ గ్రూప్ (Asia Pacific Group )ఈ మేరకు పాకిస్థాన్ దేశాన్ని బ్లాక్ లిస్టులో చేరుస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రస్తుతానికి బ్లాక్ లిస్ట్ తాత్కాలికమే. పాకిస్థాన్ కు ఈ ఏడాది అక్టోబర్ నెలవరకు ఏసియా- పసిఫిక్ గ్రూప్ గడువును ఇచ్చింది. ఈ గడుపులోపు FATF నిర్ధేషించిన స్టాండర్డ్స్ ప్రకారం ఉగ్రవాద నిర్మూలనకు ఎంతటి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందో నిరూపించుకోగలగాలి, ఒకవేళ నిరూపించుకోని పక్షంలో పాకిస్థాన్ ను శాశ్వతంగా బ్లాక్ లిస్టులోకి చేరుస్తారు.

ఇప్పటివరకు ఉగ్రవాద నిర్మూలన దిశగా పాకి తీసుకున్న 40 రకాల చర్యల్లో 32 FATF నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. అలాగే అక్రమ నగదు చలామణీ, ఉగ్రవాదులకు విరాళాల పంపిణీలాంటి అంతర్జాతీయంగా అత్యంత కీలకంగా పరిగణించబడే అంశాల్లో, లెలదీస్తే 11 పారామితుల్లో 10లో FATF లక్ష్యాలను చేరుకోవడంలో పాకిస్థాన్ విఫలమైంది. ఈ వ్యవహారంపై 41 సభ్యులు పాల్గొన్న సమావేశంలో ఎవ్వరూ కూడా పాక్ తీసుకున్న చర్యల పట్ల సంస్తృప్తి చెందకపోవడంతో పాకిస్థాన్ ను ' బ్లాక్ లిస్ట్'కు అర్హురాలిగా చేర్చారు.

ఇప్పుడు పాకిస్థాన్ శాశ్వత బ్లాక్ లిస్ట్ గండాన్ని తప్పించుకోవాలంటే అక్టోబర్ లోపు ఆ దేశం ఉగ్రవాదాన్ని నిర్మూలించ దేశంగా FATF మార్గదర్శకాల ప్రకారం నిరూపించుకోబడాలి. పాకిస్థాన్ ప్రధాని మూర్ఖత్వపు ఆలోచనలు చూస్తుంటే అది ఖచ్చితంగా సాధ్యమయ్యే పని కాదు.

కాగా, తమ దేశం 'బ్లాక్ లిస్ట్' లోకి ఎక్కటంపై ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్  స్పందించారు. తమ దేశాన్ని బ్లాక్ లిస్టులో చేర్చేలా భారత్ కుట్ర చేసింది అంటూ ఆరోపణలు చేశారు.