Hong Kong Floods: 140 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా హాంకాంగ్‌‌ను ముంచెత్తిన భారీ వరదలు, గత 24 గంటల్లో 83 మంది ఆసుపత్రి పాలు

శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్‌వేలు నీట మునగడంతో పాఠశాలలను మూసివేశారు. 140 ఏళ్లలో ఈ స్థాయి కుంభవృష్టిని చూడలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 83 మంది ఆసుపత్రి పాలయ్యారని అత్యవసర విభాగం అధికారులు వెల్లడించారు. ఈ నగరంలో దాదాపు 75 లక్షల మంది జీవిస్తున్నారు.

China Floods (Photo-AFP)

హాంకాంగ్‌, దక్షిణ చైనాను భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్‌వేలు నీట మునగడంతో పాఠశాలలను మూసివేశారు. 140 ఏళ్లలో ఈ స్థాయి కుంభవృష్టిని చూడలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 83 మంది ఆసుపత్రి పాలయ్యారని అత్యవసర విభాగం అధికారులు వెల్లడించారు. ఈ నగరంలో దాదాపు 75 లక్షల మంది జీవిస్తున్నారు.

గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 లోపు 158.1 మిల్లీమీటర్ల (6.2 అంగుళాల) వర్షం కురిసింది. 1884 తర్వాత ఒక గంటలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. క్వోలూన్‌, నగర ఉత్తర ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి లోపు 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడింది. నగరంలోని కొన్ని చోట్ల గత 24 గంటల్లో 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవలే అత్యంత బలమైన టైఫూన్‌ బారిన పడి కోలుకొంటున్న ఈ నగరంపై తాజా వరదలు దెబ్బకొట్టాయి.

అమెరికాను వణికిస్తున్న కొత్త బ్యాక్టీరియా, విబ్రియో వల్నిఫికస్ బారీన పడి ఇప్పటికే 13 మంది మృతి, సముద్ర జలాలకు దూరంగా ఉండాలని సీడీసీ హెచ్చరిక

శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్‌వేలు మొత్తం నీట మునిగిపోవడంతో పాఠశాలలను మూసివేశారు.1884 తర్వాత ఒక గంటలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదేనని అధికారులు తెలిపారు. హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ కూడా ఉదయం ట్రేడింగ్‌ను నిలిపివేసింది. అత్యవసరమైన ఉద్యోగులను మాత్రమే కార్యాలయాలకు పిలిపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాంగ్‌తాయ్‌ జిల్లాలోని ఒక రైల్వే స్టేషన్‌ పూర్తిగా నీటమునిగింది. దీంతో రైల్వే శాఖ కూడా సేవలను నిలిపివేసింది.