Hurricane Hilary: అమెరికాను వణికిస్తున్న హిల్లరీ తుఫాను, 84 ఏళ్ళ తర్వాత రికార్డు స్థాయి వరదలు, మరోవైపు దక్షిణ కాలిఫోర్నియాలో భారీ భూకంపం

తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది.

Hurricane Hilary (Photo-Video Grab)

అగ్రరాజ్యం అమెరికాను హిల్లరీ తుపాను వణికిస్తోంది. తుపాను ధాటికి అమెరికా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం కురవడం 84 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు.

84 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని స్థానిక అధికారులు తెలిపారు. మంగళవారం పలు రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.తుపాను బీభత్సం సృష్టిస్తుండడంతో నెవెడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

తుపాను వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై సర్వే ప్రారంభించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే డెత్‌ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడం గమనార్హం.కాలిఫోర్నియాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది. అసాధారణమైన వేసవి తుపానుకు తోడు భూమి కంపించడం (Eartquake)తో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

చిరుత పులిపై కోతుల దాడి వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..ఈ వైరల్ వీడియో చూసేయండి..

ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగానే.. మరోవైపు భూకంపం సంభవించడం భయాందోళన కలిగించింది. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఒకే సమయంలో తుఫాన్‌, భూకంపం సంభవించడాన్ని ‘హరికేక్‌’గా వ్యవహరిస్తారు. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్‌ఏంజెలెస్‌ నగర సమీపంలో భూమి రెండుసార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు.లాస్‌ఏంజెల్స్‌ సమీపంలో కూడా 3.1, 3.6 తీవ్రతతో భూమి రెండు సార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు.



సంబంధిత వార్తలు

Mumbai Ferry Boat Tragedy: నేవీ బోటును ఢీకొనడంతోనే ముంబై పడవ ప్రమాదం, 13 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం ఫడ్నవిస్, మృతుల కుటుంబాలకు రూ. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif