Darwin's Arch Collapses: కుప్పకూలిన ప్రపంచ పర్యాటక ప్రదేశం, రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తున్న డార్విన్ ఆర్చ్, సముద్రపు నీటి మధ్యలో ఉన్న రాతి కట్టడం కూలిపోయిందని తెలిపిన ఈక్వెడార్ పర్యావరణ మంత్రిత్వ శాఖ
పేరుగాంచిన సహజసిద్ధ రాతినిర్మాణం డార్విన్ ఆర్చ్ (Darwin's Arch Collapses) కూలిపోయింది.
వైల్డ్‌లైఫ్ పరంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గాలాపాగోస్ ద్వీపంలో ప్రకృతి సిద్ధ ప్రమాదం చోటుచేసుకుంది. పేరుగాంచిన సహజసిద్ధ రాతినిర్మాణం డార్విన్ ఆర్చ్ (Darwin's Arch Collapses) కూలిపోయింది. దక్షిణ పసిఫిక్ సముద్రంలో (Pacific Ocean) ఉన్న ద్వీపకల్పంలో గాలాపోగోస్ ద్వీపంలో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే సహజసిద్ధ రాతి కట్టడం డార్విన్ ఆర్చ్ (Iconic Darwin's Arch In Galapagos Collapses) అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ విషయాన్ని ఈక్వెడార్ పర్యాటక శాఖ అధికారికంగా ప్రకటించింది. సహజ సిద్ధ శిలా తోరణం ప్రస్తుతం రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తోంది.
ఒకప్పుడు డార్విన్ ద్వీపంలో ఈ కట్టడం ఓ భాగంగా ఉందంట. కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఆ కట్టడం నీటిలోకి చేరిపోయింది. సముద్రపు నీటి మధ్యలో ఈ ఆర్చ్ అద్భుతంగా కనిపించేంది. ఈ కట్టడానికి జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్ డార్విన్ పేరు మీదుగా డార్విన్ ఆర్చ్ పేరు పెట్టారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో దీనికి చోటు కల్పించింది.
Here's Darwin's Arch Collapses Visuals
19 వ శతాబ్దంలో ద్వీపాల్లోని ఫించ్‌ల అధ్యయనం పరిణామ సిద్ధాంతాన్ని వివరించడానికి జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్‌కు ఇది సహాయపడిందని చరిత్ర చెబుతోంది. అంతే కాదు ఎంతో నిర్మలంగా ఉండే ఈ ప్రాంతం డైవింగ్ ప్రదేశంగా పరిగణించబడుతోంది. తూర్పు ద్వీపానికి 600 మైళ్ల దూరంలో ఉన్న ఈ రాతికట్టడం డార్విన్ ఆర్చ్ కుప్పకూలిపోవడానికి సముద్రపు సహజ కోత కారణమని విశ్లేషకులు అంటున్నారు.
కాగా గాలాపాగోస్ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అడ్వైంచర్స్, సాహసాలు చేయాలనుకున్న వారికి ఇది అనువైన ప్రాంతం. ఫొటో షూట్‌లకు పేరు పొందింది. డార్విన్ ఆర్చ్ కూలిపోయిందని ఈక్వెడార్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చారిత్రక సహజ కట్టడంలో ప్రస్తుతం రెండు స్తంభాలు మాత్రమే మిగిలి ఉందని చెబుతూ ఫొటోలు విడుదల చేసింది.