Sunita Williams: 58 ఏళ్ల వయసులో అంతరిక్షానికి.. చరిత్ర సృష్టించిన సునీతా విలియమ్స్

తొలిసారి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమైన బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో 58 ఏళ్ల వయసులో...

Sunita Williams (Credits: X)

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు. తొలిసారి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమైన బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో 58 ఏళ్ల వయసులో అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. ఈ ప్రయాణంలో బుట్చ్ విల్‌మోర్ అనే మరో వ్యోమగామి ఆమెకు తోడుగా ఉండనున్నారు.

భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10 గంటల 52 నిముషాలకు ఈ స్టార్‌లైనర్ షిప్ లాంచ్ పూర్తయింది. దీనికోసం యునైటెడ్ లాంచ్ అలియన్సెస్‌కు చెందిన అట్లాస్ వీ రాకెట్‌ను వినియోగించారు. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్‌లోని స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 ద్వారా ఈ రాకెట్ లాంచ్ చేయడం జరిగింది.

కాగా.. విలియమ్స్, విల్‌మోర్‌లతో అంతరిక్షంలోకి దూసుకెళ్లిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ నేరుగా వెళ్లి ఇంటర్నేషనల్ స్పేస్ శాటిలైట్ (ఐఎస్ఎస్)కు కనెక్ట్ అవుతుంది. ఒకసారి ఐఎస్ఎస్‌కు డాక్ అయిన తర్వాత ఇద్దరు ఆస్ట్రోనాట్స్ అక్కడ దాదాపు ఓ వారం రోజులు ఉండనున్నారు. అంతేకాదు.. ఈ స్పేస్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా దాదాపు 350 కిలోలకు పైగా కార్గోను కూడా స్పేస్‌లోకి పంపించడం జరిగింది. ఈ కార్గోను ఐఎస్ఎస్‌కు అందజేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కు లక్ష కిలోల బంగారం తరలింపు ఎందుకు జరిగిందో తెలుసా?

ఇదిలా ఉంటే భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్‌ అనే విషయం మనందరికి తెలిసిందే. 2002లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్.. ఆ తర్వాత 2006లో మరోసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి స్పేస్ టూర్‌కు వెళ్ళారు.