Indian Student Attacked in Australia: ఆస్ట్రేలియాలో దారుణం.. భారతీయ విద్యార్థిని కారులోంచి బయటకు లాగి ఇనుప రాడ్లతో కొట్టిన ఖలిస్థానీ మద్దతుదారులు
ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ఓ భారతీయ విద్యార్థిపై(23) దాడి జరిగింది. అతడిని ఖలిస్థానీ మద్దతుదారులు ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. సిడ్నీ నగరంలోని మెర్రీల్యాండ్స్‌లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఈ ఘటన జరిగింది.
Sydney, July 15: ఆస్ట్రేలియాలో (Australia) దారుణం జరిగింది. ఖలిస్థానీ (Khalisthan) తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ఓ భారతీయ విద్యార్థిపై(23) (Indian Student) దాడి జరిగింది. అతడిని ఖలిస్థానీ మద్దతుదారులు ఇనుప రాడ్లతో (Iron Rods) కొట్టి తీవ్రంగా గాయపరిచారు. సిడ్నీ(Sydney) నగరంలోని మెర్రీల్యాండ్స్‌లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బాధితుడు తన వాహనంలో బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అయిదుగురు ఖలిస్థానీవాదులు యువకుడిని చుట్టుముట్టారు. కారులో ఉన్న అతడి దవడపై ఇనుపరాడ్డుతో పొడిచారు. ఈలోపు మరికొందరు వాహనం తలుపు తెరిచి విద్యార్థిని బయటకు లాగి కింద పడేసి ఇనుప రాడ్లతో ఇష్టారీతిన దాడి చేశారు.
హైదరాబాద్‌లో బిజేపీ నేత మిస్సింగ్, గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు
తీవ్ర హెచ్చరికలు
ఖలిస్థానీ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తే ఇలాగే జరుగుతుందని అతడికి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనను ఓ గుణపాఠంగా భావించాలని యువకుడికి సూచించిన వారు.. అతడి తీరు మారకపోతే ఇలాంటి గుణపాఠాలు మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యువకుడికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు కావడంతో అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.