Iranian Consulate in Paris Bomb Threat: పారిస్ లో ఉగ్రదాడియత్నం భగ్నం, ఇరాన్ రాయబార కార్యాలయంలోకి గ్రనైడ్లతో చొరబడ్డ వ్యక్తి, ఆత్మాహుతి దాడికి పాల్పడుతానంటూ బెదిరింపు(వీడియో ఇదుగోండి)
తనను తాను పేల్చుకుంటానని (Bomb Threat) బెదిరించాడు. దీంతో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్దకు భారీగా భద్రతా సిబ్బంది చేరుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈ సంఘటన జరిగింది.
Paris, April 19: గ్రెనేడ్లు, బాంబులతో కూడిన జాకెట్ ధరించిన ఒక వ్యక్తి ఇరాన్ రాయబార కార్యాలయంలోకి (Iranian Consulate) ప్రవేశించాడు. తనను తాను పేల్చుకుంటానని (Bomb Threat) బెదిరించాడు. దీంతో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్దకు భారీగా భద్రతా సిబ్బంది చేరుకున్నారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అనుమానిత వ్యక్తి ఇరాన్ కాన్సులేట్ (Iran consulate) వద్ద కనిపించాడు. గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలు ఉన్న జాకెట్‌ను అతడు ధరించాడు. తనను తాను పేల్చుకుంటానని (Man Threatens to Blow Himself) బెదిరించాడు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా సిబ్బంది ఇరాన్ కాన్సులేట్ చుట్టూ మోహరించారు. అనుమానిత వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఉగ్రదాడికి ప్రయత్నించాడా? లేక మరో కారణంతో ఇలా ప్రవర్తించాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఇరాన్ రాయబార కార్యాలయం ప్రాంతంలోని రెండు మెట్రో లైన్స్‌లో రాకపోకలను నిలిపివేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన ఫ్రాన్స్‌లో కలకలం రేపింది.