Ukraine Crisis: రష్యాకు జో బైడెన్‌ షాక్, ర‌ష్యా ఆయిల్ దిగుమ‌తుల‌పై యూఎస్ నిషేధం.. ఆకాశాన్ని తాకిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు

ఇందులో భాగంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా (America) నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి గ్యాస్‌, ఆయిల్‌ దిగుమతులపై నిషేదం ( Ban on All Imports of Russian Gas, Oil) విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రకటన చేశారు.

Joe Biden (Photo Credits: IANS)

New Delhi, Mar 9: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన ర‌ష్యా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా దెబ్బ తీసేందుకు అమెరికా సిద్ధ‌మైంది. ఇందులో భాగంగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ అమెరికా (America) నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి గ్యాస్‌, ఆయిల్‌ దిగుమతులపై నిషేదం ( Ban on All Imports of Russian Gas, Oil) విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ప్రకటన చేశారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోంది. పుతిన్‌ వార్‌ మనిషిలా మారాడు. పోలండ్‌, ఉక్రెయిన్‌ పరిస్థితులపై సమీక్షిస్తున్నాం. ఉక్రెయిన్‌కు అండగా ఉంటాం నిధులిస్తూనే ఉంటాం. ఆయుధాలు కూడా ఇస్తూనే ఉంటాం' అని జో బైడెన్‌ స్పష్టం చేశారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో యూరోపియ‌న్ యూనియ‌న్ మిత్ర దేశాలు త‌మ‌తో క‌లిసి వ‌చ్చేలా లేవ‌ని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌, పోలండ్‌ల్లో ప‌రిస్థితుల‌పై స‌మీక్షిస్తున్నామ‌ని చెప్పారు. ఉక్రెయిన్‌కు త‌మ ఆయుధాల స‌ర‌ఫ‌రా కొన‌సాగుతూనే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఉక్రెయిన్ శ‌ర‌ణార్థుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని తేల్చి చెప్పారు. ర‌ష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చ‌మురుపై అన్ని దేశాలు వెంట‌నే బ్యాన్ విధించాల‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ కోరిన విష‌యం తెలిసిందే.

రష్యాకు భారీ షాక్, ఉక్రెయిన్‌కు అండగా ప్రపంచ బ్యాంక్, ఆర్థిక అత్యవసర పరిస్థితి నుంచి బయటపడేందుకు 723 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు వెల్లడి

ఈనేప‌థ్యంలో ర‌ష్యా నుంచి ముడి చ‌మురు దిగుమ‌తిపై యూఎస్ నిషేధం విధించింది.ఈ నేప‌థ్యంలో ఒక్క‌సారిగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని తాకాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధ‌ర ప్ర‌స్తుతం 129.92 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. ఒకేసారి 5.45 శాతం పెరిగింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif