World Bank (Photo Credits: Pixabay)

Washington, March 8: గత కొద్ది రోజులుగా సంపన్న దేశం రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌ తీవ్రంగా (Russia-Ukraine Conflict) నష్టపోయింది. ఇప్పటికే యూకే పీఎం బోరిస్ జాన్సన్ 100 బిలియన్ డాలర్ల సాయం ప్రకటిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రపంచ బ్యాంక్ కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలబడేందుకు (Ukraine Amid Conflict With Russia) ముందుకొచ్చింది. అందులో భాగంగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఉక్రెయిన్‌ కోసం 723 మిలియన్ డాలర్ల (World Bank Approves USD 723 Million) సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది.

ఆర్థిక అత్యవసర పరిస్థితి నుంచి బయటపడేందుకు సప్లిమెంటరీ బడ్జెట్​ సపోర్ట్​ ప్యాకేజీకి ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ప్యాకేజీలో 350 మిలియన్​ డాలర్లు అనుబంధ రుణం, 139 మిలియన్​ డాలర్లు గ్యారెంటీ, 134 మిలియన్​ డాలర్లు గ్యాంట్​ ఫైనాన్సింగ్​, 100 మిలియన్​ డాలర్లు ఫైనాన్సింగ్​ కోసం నిధులుగా కేటాయించారు.ఈ ప్యాకేజీ ఉక్రేనియన్ ప్రజలకు కీలకమైన సేవలను అందించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఈ నగదును ఆసుపత్రి కార్మికులకు వేతనాలు, వృద్ధులకు పెన్షన్లు, నిస్సహాయులకు సామాజిక కార్యక్రమాలు కోసం వినియోగించనున్నారు.