Earthquake: టర్కీలో భూకంపం, ఇస్తాన్‌బుల్‌లో 8 మందికి గాయాలు, నెలరోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఏదో మూలన వరుస భూప్రకంపనలు
గత నెలరోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట భూమి కంపిస్తూనే ఉంది, భూమి పొరల్లో కదలిక రావడం వల్లే ఇలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్లు జియో సైంటిస్టులు తెలుపుతున్నారు....
Istanbul, October 04: టర్కీ పశ్చిమ తీరంలో గురువారం 5.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు మరియు అత్యవసర నిర్వహణ అథారిటీ (AFAD) తెలిపింది.
టర్కీ (Turkey) యొక్క నైరుతి ముయాలా ప్రావిన్స్ నుండి 57 కిలోమీటర్ల గ్రీస్ దేశానికి సమీపంలో ఉండే రోడ్స్ ద్వీపంలో భూమి అంతర్భాంగంలో 6 కిలోమీటర్ల (3.7 మైళ్ళు) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ అధికారులు గుర్తించారు. స్థానిక సమయం ప్రకారం గురువారం ఉదయం 7:44 ( (0444 GMT)) గంటల సమయంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. ముగ్లా మరియు పొరుగు దాని పొరుగు జిల్లాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ భూకంపం వలన ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని ముయాలా గవర్నర్ ఎసెంగల్ సివెలెక్ తెలియజేశారు.
గత వారం కూడా, టర్కీలో అత్యధిక జనాభా కలిగిన ఇస్తాంబుల్ (Istanbul) నగరం 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా నగరంలోని పలుచోట్ల భవానాలు కదిలాయి. దీని కారణంగా అక్కడక్కడ పెచ్చులు ఊడిపడి 8 మందికి గాయాలయ్యాయి. తాజాగా మరోసారి భూకంపం రావడంతో టర్కీ ప్రజలు వణికిపోతున్నారు.
టర్కీలో వారం రోజుల క్రిందటి సంభవించిన భూకంపనల దృశ్యం
గత నెలరోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట భూమి కంపిస్తూనే ఉంది, భూమి పొరల్లో కదలిక రావడం వల్లే ఇలాంటి ప్రకంపనలు చోటు చేసుకుంటున్నట్లు జియో సైంటిస్టులు తెలుపుతున్నారు. ఈ నెలరోజుల వ్యవధిలో సంభవించిన భూకంప వివరాల కోసం బ్లూలింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు.