Man Stabs Wife 30 Times: విడాకులు అడిగిందని భార్యను 30 సార్లు కత్తితో పొడిచిన భర్త, లాస్ వేగాస్‍లో దారుణ ఘటన, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

విడాకులు కావాలని అడిగిన భార్యపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. కత్తితో 30 సార్లు (Man Stabs Wife 30 Times) పొడిచి కిరాతక చర్యకు పాల్పడ్డాడు

Image used for representational purpose only | (Photo Credits: PTI)

US, August1: అమెరికాలోని లాస్ వేగాస్‍లో భర్త తన భార్యపై అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. విడాకులు కావాలని అడిగిన భార్యపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. కత్తితో 30 సార్లు (Man Stabs Wife 30 Times) పొడిచి కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడు క్లిఫర్డ్ జాకబ్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరుచనున్నారు.

కాగా భార్య వచ్చి విడాకులు కావాలని (She Asks for Divorce) అడిగిన తర్వాత తన మైండ్ బ్లాంక్ అయిందని నిందితుడు చెప్పాడు. ఏం చేశానో కూడా తనకు గుర్తులేదని పేర్కొన్నాడు. తాను మళ్లీ తేరుకునే సరికి ఆమె రక్తపుమడుగులో ఉన్నట్లు పోలీసులకు వివరించాడు.నిందితుడి ఇంట్లో ఐదు కత్తులు, రక్తపు మరకలు ఉన్న కత్తెర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

భార్యపై పదే పదే అనుమానం, తట్టుకోలేక రోకలి బండతో తలపై కొట్టి చంపిన భార్య, కృష్ణా జిల్లాలో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ ఘటనలో భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె మొహం, మెడపై కత్తిపోట్లున్నాయి. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. టెక్సాస్‌లో మే నెలలోనూ విడాకులు అడిగిందని ఉగ్రవాదిలా మారాడు ఓ భర్త. కోర్టు ఆవరణలోనే భార్య, కూతురు, అత్తను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif