Doctor Saves Man's Life: విమానంలో ప్రయాణికుడికి వెంటవెంటనే రెండు సార్లు గుండెపోటు, రెండు గంటల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన భారత సంతతి వైద్యుడు విశ్వరాజ్ వేమల
ఆ విమానంలో ప్రయాణించిన భారత సంతతి వైద్యుడు విశ్వరాజ్ వేమల సుమారు రెండు గంటలపాటు చికిత్స అందించి ఆ వ్యక్తిని (Doctor Saves Man's Life) కాపాడారు.
బ్రిటన్లో విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆ విమానంలో ప్రయాణించిన భారత సంతతి వైద్యుడు విశ్వరాజ్ వేమల సుమారు రెండు గంటలపాటు చికిత్స అందించి ఆ వ్యక్తిని (Doctor Saves Man's Life) కాపాడారు. దీంతో ఆ వైద్యుడి సేవలను ఆయన పని చేసే ఆసుపత్రి కొనియాడింది.
డాక్టర్ విశ్వరాజ్ వేమల (Indian-origin doctor Vishwaraj Vemala) బ్రిటన్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్స్ బర్మింగ్‌హామ్‌లో కన్సల్టెంట్ హెపటాలజిస్ట్‌గా వైద్య సేవలందిస్తున్నారు. తన తల్లిని బెంగళూరులోని సొంత ఇంటికి తీసుకువచ్చేందుకు నవంబర్‌లో ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు ప్రయాణించారు.
మందుల దుకాణంలో ఓఆర్‌ఎస్ తీసుకుంటుండగా గుండెపోటు, కుప్పకూలిన యువకుడు, సీసీ టీవీ పుటేజీ వైరల్
అయితే ఆ విమానంలో ప్రయాణించిన 43 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో సీటు నుంచి కిందకు పడిపోయాడు. గమనించిన విమాన సిబ్బంది డాక్టర్ కోసం అనౌన్స్ చేశారు. దీంతో డాక్టర్ విశ్వరాజ్ వెంటనే స్పందించి రోగి వద్దకు వెళ్లారు. విమాన సిబ్బంది సహాయంతో గంటపాటు సీపీఆర్ చేసి ఆయన స్పృహలోకి వచ్చేలా (Indian-origin doctor saves man ) చేశారు.
జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తి గుండెపోటుతో కుప్పకూలిన ఓ వ్యక్తి, సీసీ టీవీ పుటేజీ వైరల్
విమానంలో ఉన్న ఎమర్జెన్సీ కిట్ ద్వారా ఆక్సిజన్, ఇతర వైద్య సేవలు అందించారు.యూనివర్సిటీ హాస్పిటల్స్ బర్మింగ్‌హామ్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. భారత సంతతి వైద్యుడు విశ్వరాజ్ తోటి విమాన ప్రయాణికుడ్ని కాపాడిన తీరును ప్రశంసించింది.
Here's Hospital Tweet
ఈ సంఘటన నేపథ్యంలో ఆ విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ సిబ్బంది హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. విమానం దిగే ముందు ఆ వ్యక్తి చాలా భావోద్వేగానికి గురయ్యాడని, కన్నీళ్లతో తనకు కృతజ్ఞతలు చెప్పాడంటూ డాక్టర్ విశ్వరాజ్ గుర్తు చేసుకున్నారు.